Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మందు బాబులకు షాకింగ్ న్యూస్.. మద్యం తాగి చనిపోతే బీమా పరిహారం..?

Advertiesment
Supreme Court
, మంగళవారం, 23 మార్చి 2021 (09:15 IST)
మందు బాబులకు ఇది షాకింగ్ న్యూస్. అతిగా మద్యం తాగి చనిపోయిన వ్యక్తి వారసులకు బీమా పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని సోమవారం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రమాదంలో మరణిస్తే తప్ప ఇతర సందర్భాల్లో పరిహారం ఇవ్వాల్సిన పనిలేదని జస్టిస్‌ ఎం.ఎం. శాంతన్‌గౌండర్‌, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ విషయమై జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార సంఘం ఇచ్చిన తీర్పును సమర్థించింది. 
 
సిమ్లా జిల్లాలోని చోపాల్‌ పంచాయతీలో హిమాచల్‌ అటవీ సంస్థలో చౌకీదారుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి 1997 అక్టోబరు 7-8 తేదీల మధ్య కురిసిన భారీ వర్షాలు, చలి కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు కుటుంబసభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే శవ పరీక్ష జరపగా ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, అధికంగా మద్యం తాగడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్టు తేలింది. 
 
ఇది ప్రమాదం కాకపోవడంతో పరిహారం చెల్లించడానికి బీమా కంపెనీ నిరాకరించింది. కుటుంబ సభ్యులు జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించగా అనుకూలంగా తీర్పు వచ్చింది. అనంతరం బీమా కంపెనీ జాతీయ ఫోరంను ఆశ్రయించింది. బీమా కంపెనీ ఎలాంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని, అయితే అటవీ సంస్థ మాత్రం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టుకు అపీలు చేయగా పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రెండు సంస్థలకూ లేదని తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫేస్‌బుక్ కంటెంట్‌ తనిఖీ కోసం ఇండిపెండెంట్ ఫ్యాక్ట్ చెకర్స్!