Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పంజాబీ కుర్రాడిని పట్టేసిన పోలీసులు: అమ్మాయినని ఫేక్ ఐడీతో డేటింగ్‌కు రమ్మనారు...?

యువతపై సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. ఫేస్ బుక్ చూడనిదే నేటి యువతకు పూట గడవదు. సోషల్ మీడియాతో మేలు జరుగుతున్న మాట గోరింతే అయినా నేరాల సంఖ్య మాత్రం బాగా పెరిగిపోతుందన్నమాట నిజం. తాజాగా అమ్మాయిలను

Advertiesment
Delhi: 22-yr-old harasses woman to get intimate
, గురువారం, 6 అక్టోబరు 2016 (18:01 IST)
యువతపై సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. ఫేస్ బుక్ చూడనిదే నేటి యువతకు పూట గడవదు. సోషల్ మీడియాతో మేలు జరుగుతున్న మాట గోరింతే అయినా నేరాల సంఖ్య మాత్రం బాగా పెరిగిపోతుందన్నమాట నిజం. తాజాగా అమ్మాయిలను వేధించడం, మార్ఫింగ్ చేసిన ఫోటోలతో బ్లాక్ మెయిల్‌కు పాల్పడిన పంజాబీ కుర్రాడిని పోలీసులు ట్రాప్ చేసి అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. బిఎస్సీ ఫైనలియర్ చదువుతున్న 20ఏళ్ల జగ్దీప్‌సింగ్‌కు తాను అమ్మాయినని ఫేక్ ఫేస్ బుక్ ఐడీ ద్వారా అమ్మాయిలను పరిచయం చేసుకుంటాడు. ఇలా స్నేహం కుదిరాక అమ్మాయిల ఫోటోలు సంపాదించి, వాటిని మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు రాబట్టడం మొదలుపెట్టాడు. జగ్దీప్ ఆగడాలు మితిమీరిపోయాయి. ఫేస్‌బుక్‌లో బూతు మెసేజ్‌లు పెట్టడం, తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ అసభ్య పదజాలంతో కూడిన మేసేజ్‌లతో ఎవరో వేధిస్తున్నారంటూ పంజాబ్ కీర్తినగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు నమోదయ్యాయి. 
 
దీంతో ఫేక్ ఫేస్ బుక్ యువకుడి ఆట కట్టించేందుకు పంజాబీ పోలీసులు పక్కా ప్లాన్ వేశారు. ఇందుకోసం పక్కా ప్లాన్ ప్రకారం ఫేక్ ఐడీతో చాటింగ్ చేసి అతడిని పట్టుకున్నారు. చాటింగ్, ఫోన్, వాట్సప్ ద్వారా పోలీసులు అమ్మాయిల పేరిట ఫేక్ ఐడీలతో జగ్దీప్‌ను ట్రాప్‌లో వేసుకున్నారు. ఓ రోజు డేటింగ్ కోసం ఢిల్లీకి రమ్మని పోలీసులే మెసేజ్ పెట్టారు. జగ్దీప్ కూడా ఖుషీ ఖుషీగా అమ్మాయిల ఐడీ ఒరిజినల్ అని.. పంజాబ్ నుంచి ఢిల్లీకి బయల్దేరాడు. అయితే పోలీసులు అతనిని అరెస్ట్ చేసి.. కేసును విచారిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉండలేకపోతున్నాం.. నరకం అనుభవిస్తున్నాం: ప్రజలు