Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వీల్ చైర్ కోసం ఎన్నారై నుంచి రూ.10 వేలు వసూలు చేసిన రైల్వే పోర్టర్... ఎక్కడ?

Advertiesment
delhi railway station

ఠాగూర్

, గురువారం, 2 జనవరి 2025 (11:28 IST)
రైల్వే స్టేషన్‌లలో ఉండే కొందరు పోర్టర్లు ఏమాత్రం మానవత్వం లేని వారిగా ప్రవర్తిస్తుంటారు. రైలు ప్రయాణికులు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వారిని పట్టిపీడిస్తుంటారు. తాజాగా ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో ఓ పోర్టర్ చేసిన పాడుపనికి రైల్వే శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతని పోర్టర్ లైసెన్స్‌ను రద్దు చేసి, పోర్టర్ బ్యాడ్జ్‌ను కూడా వెనక్కి తీసుకుంది. ఇంతకీ ఈ పోర్టర్ చేసిన పాడుపడి ఏంటంటే.. వీల్ చైర్ సర్వీస్ కోసం ఓ ఎన్నారై నుంచి రూ.10 వేలు తీసుకున్నాడు. ఆ ఎన్నారై కుమార్తె ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఘటనపై విచారణకు ఆదేశించడంతో పాటు పోర్టర్ తీసుకున్న రూ.10 వేల డబ్బులో రూ.9 వేలు వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. ఇలాంటి సంఘటనలను ఏమాత్రం సహించబోమని హెచ్చరించింది. పోర్టర్ నుంచి బ్యాడ్జ్‌ను ఢిల్లీ డివిజన్ వెనక్కి తీసుకున్నట్టు తెలిపింది. ప్రయాణికుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని తేల్చి చెప్పింది. రైల్వే స్టేషన్‌లలో వీల్ చైర్ సేవలు ఉచితంగా లభిస్తాయి. అయితే, గత నెల 28వ తేదీన తన తండ్రి నుంచి ఏకంగా రూ.10 వేలు వసూలు చేశారంటూ ఎన్నారై ప్రయాణికుడి కుమార్తె పాయల్ రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసింది. 
 
దీంతో రంగంలోకి దిగిన రైల్వే అధికారులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఆ పోర్టర్‌ను గుర్తించి అతడి నుంచి రూ.9 వేలు వెనక్కి తీసుకుని ప్రయాణికుడికి అందించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డివిజనల్ రైల్వే మేనేజర్ స్పందిస్తూ, ప్రయాణికుల సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణానికి రైల్వే కట్టుబడివుందని తెలిపారు. ఇలాంటి సంఘటనలు రైల్వే శాఖ ప్రతిష్టను దిగజారుస్తాయని, ఇలాంటి సమస్యలు ఎదురైతే 139కు ఫిర్యాదు చేయాలని సూచించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చనిపోయిన పెంపుడు శునకం... ఆత్మహత్య చేసుకున్న యజమాని.. ఎక్కడ?