Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జమిలి ఎన్నికల బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్

Advertiesment
one nation - one election

ఠాగూర్

, మంగళవారం, 17 డిశెంబరు 2024 (13:33 IST)
జమిలి ఎన్నికలపై లోక్‌సభలో ఓటింగ్ నిర్వహించారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ‘ఒకే దేశం - ఒకే ఎన్నిక’ ప్రణాళిక ఎట్టకేలకు పార్లమెంట్‌ ముందుకొచ్చింది. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా, మరో బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 
 
ఆ తర్వాత అనంతరం దీనిపై చర్చ చేపట్టగా.. కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ సహా పలు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అటు ఎన్డీయే మిత్ర పక్షాలు బిల్లులకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఆ తర్వాత దీనిపై ఓటింగ్‌ నిర్వహించారు. ఈ బిల్లుకను ప్రవేశపెడుతూ కేంద్రమంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ తీసుకొచ్చిన తీర్మానంపై లోక్‌సభలో ఓటింగ్‌ నిర్వహించారు. 
 
కొత్త పార్లమెంట్‌ భవనంలో పూర్తి ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ క్రమంలోనే ఓటింగ్‌ విధానంపై లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ సభ్యులకు వివరించారు. అనంతరం జమిలి బిల్లును ప్రవేశపెట్టడంపై ఓటింగ్‌ నిర్వహించగా.. 220 మంది అనుకూలంగా ఓటేశారు. 149 మంది వ్యతిరేకించారు.
 
మరోవైపు, ఈ బిల్లుకు భేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు టీడీపీకి చెందిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ సభకు తెలియజేశారు. ‘‘సృజనాత్మక ఆలోచనలకు తెదేపా ఎప్పుడూ మద్దతిస్తుంది. సహకార, సమాఖ్య తత్వానికి మేం అనుకూలం. జమిలి ఎన్నికలతో ఖర్చు తగ్గి సామర్థ్యం పెరుగుతుంది. పోలింగ్‌ శాతం మెరుగవుతుంది. ఎన్నికల ఖర్చు రూ.లక్ష కోట్లు దాటుతోంది. నిరంతరం ఎన్నికల నిర్వహణ వల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోంది’’ అని తెదేపా ఎంపీ వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనవరి 1, 2025 నుండి ఇండోర్ యాచిస్తే ఎఫ్ఐఆర్ నమోదు..