Publish Date: Thu, 10 Oct 2019 (12:55 IST)
Updated Date: Thu, 10 Oct 2019 (12:57 IST)
కావలసినవి:
చేపలు - అరకేజీ
ఉల్లిపాయలు - నాలుగు
పచ్చిమిర్చి - నాలుగు
కారం - రెండు టీస్పూన్లు
జీలకర్ర పొడి - టీస్పూన్
ధనియాల పొడి - ఒక టీస్పూన్
పసుపు - టీస్పూన్
టొమాటో - ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్టు - టీస్పూన్
కొత్తమీర - కట్ట
నూనె - తగినంత
ఉప్పు - తగినంత
తయారీ విధానం:
ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి కొద్దిగా కారం, పసుపు, ఉప్పు వేసి కలియబెట్టి, అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పాన్ తీసుకొని నూనె వేసి కాస్త వేడి అయ్యాక చేప ముక్కలు వేసుకుని కాసేపు వేగించి పక్కన పెట్టుకోవాలి. మరొకపాత్రలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మరికాసేపు వేగించాలి. కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, టొమాటో ముక్కలు, తగినంత ఉప్పు వేసి మరి కాసేపు వేగించాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. తరువాత వేగించి పెట్టుకున్న చేప ముక్కలు వేసి మరి కాసేపు ఉడికించాలి. కొత్తిమీర వేసుకుని వేడి వేడిగా తింటే చేపల ఇగురు టేస్ట్ సూపర్బ్‌గా ఉంటుంది.
మనీల
Publish Date: Thu, 10 Oct 2019 (12:55 IST)
Updated Date: Thu, 10 Oct 2019 (12:57 IST)