Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

07-11-2018 బుధవారం దినఫలాలు - ఊహించని ఖర్చుల వల్ల ఒడిదుడుకులు...

Advertiesment
Daily Horoscope
మేషం: ఏజెంట్లు, బ్రోకర్లు, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. క్రీడా, కళారంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది, కుటుంబలో ఊహించని చికాకులు ఎదుర్కుంటారు. ఖర్చులు సామా
న్యంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడడం మంచిదని గమనించండి. బంధువుల వైఖరి అసహానం కలిగిస్తుంది. 
 
వృషభం: పారిశ్రామిక రంగాల వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. స్పెక్యులేషన్ విషయంలో మీ అంచనాలు ఫలించవు. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ వహించండి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. స్త్రీలకు వస్త్ర ప్రాప్తి, వస్తులాభం వంటి శుభ పరిణామాలుంటాయి.  
 
మిధునం: ఊహించని ఖర్చులు వలన ఒడిదుడుకులు తప్పవు. మీ సంతానం విద్యా, ఆరోగ్య విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. అతిధి మర్యాదలు సమర్థంగా నిర్వహిస్తారు. నూతన దంపతులు కొత్త అనుభుతికి లోనవుతారు. శుభకార్యాల్లో స్త్రీలు అందరినీ ఆకట్టుకుంటారు.    
 
కర్కాటకం: విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. చేపట్టిన పనులు హడావుడిగా ముగిస్తారు. ఆత్మీయుల అతిధి మర్యాదలు సంతృప్తినిస్తాయి. బీమా, రుణ వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. నూతన కాంట్రాక్టులు, ఏజెన్సీలు, లీజులకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. 
 
సింహం: సర్టిఫికెట్లు, విలువైన పత్రాలు అందుకుంటారు. ప్రయాణాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆలయాలను సదర్శిస్తారు. ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్‌లో జాప్యం తప్పదు. వృత్తుల వారికి కొన్ని ప్రతికూలత లెదురవుతాయి. 
 
కన్య: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. పుణ్యక్షేత్రం సందర్శిస్తారు మార్కెటింగ్, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ప్రింటింగ్ రంగాల వారు అక్షర దోషాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. 
 
తుల: విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఒకరికి సలహా ఇచ్చి మరొకరి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడుతారు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఆహ్వానాలు అందుతాయి. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం.    
 
వృశ్చికం: విదేశీయానం కోసం చేసే యత్నలు ఫలిస్తాయి. కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. మెుండి బాకీలు వసూళ్లలో శ్రమాధిక్యత, ప్రయాస లెదుర్కుంటారు. కొంతమంది మీ వ్యాఖ్యాలను తప్పుగా అర్థం చేసుకుంటారు. కార్మికులకు, వ్యవసాయ కూలీలకు ఆశాజనకం.   
 
ధనస్సు: ఎల్.ఐ.సి, పోస్టల్ ఏజెంట్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ అభిప్రాయాలు, భావాలు సున్నితంగా వ్యక్తం చేయండి. నిరుద్యోగ యత్నాలు కలిసివస్తాయి. ఒక శుభకార్యం దగ్గర పడుతున్నకొద్ది మీలో ఉత్సాహం చోటు చేసుకుంటుంది. మీ ఉన్నతిని చాటుకోవడానికి ధనం విరివగా వ్యయం చేస్తారు.  
 
మకరం: శస్త్ర చికిత్సల సమయంలో వైద్యులకు, ఏకాగ్రత ముఖఅయం. మీ వాగ్ధాటితో ఎదుటి వారిని మెప్పిస్తారు. ఆత్మీయుల సహకారంతో కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. సంఘంలో మంచి గుర్తింపు పొందుతారు. గృహ మరమ్మత్తులు, నిర్మాణాలు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. వృత్తులు, నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి.  
 
కుంభం: ఉద్యోగ రీత్యా దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారు అచ్చుతప్పులు పడుటవలన మాటపడవలసి వస్తుంది. స్త్రీలు స్వల్పం అస్వస్థతకు లోనవుతారు. మీ శ్రీమతి మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు, విద్యాసంస్థల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది.     
 
మీనం: ఆస్తి వ్యవహారాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఏమరుపాటు తన వలన విలువైన వస్తువులు చేజార్చుకుంటారు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. ధనం బాగా వెచ్చించినా ప్రయోజనకరంగా ఉంటుంది. ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

06-11-2018 మంగళవారం దినఫలాలు.. స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో...