Daily Horoscope

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

09-05-2019 గురువారం దినఫలాలు - దత్తాత్రేయుడని ఆరాధించి మీ సంకల్పం సిద్ధిస్తుంది

Advertiesment
Daily Horoscope
మేషం: ఏసీ కూలర్లు మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తి కానవచ్చును. టెక్నికల్, కంప్యూటర్ రంగాలల్లోని వారికి సత్కాలం. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనసత్త్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. రాజకీయాల్లోని వారికి మెళకువ అవసరం. రావలసిన ధనం కొంత ముందు వెనుకైనా అందుతుంది. 
 
వృషభం: ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. పెట్టుబడులలో కాస్త నిదానంగా వ్యవహరంచడం మంచిది. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. మనశ్శాంతి లోపం అధికమవుతుంది. ఎలక్ట్రానిక్ వస్తువుల పట్ల ఆకర్షితులౌతారు. రుణ యత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో జయం. 
 
మిథునం: బంగారు, వెండి, వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం. ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతారు. ఖర్చులు అధికమవుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. కొన్ని పనులు చివరిలో వాయిదా వేస్తారు. 
 
కర్కాటకం: పారిశ్రామిక, కళారంగాల వారికి అనుకోని ఆహ్వానాలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకుని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. గృహంలో విలువైన వస్తువులు చోరికి గురయ్యే ఆస్కారం వుంది. స్పెక్యులేషన్ రంగాల్లో వారికి లాభదాయకం.
 
సింహం: ఏదో సాధించలేకపోయామన్న భావం మిమ్మల్ని వెన్నాడుతుంది. మీ శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చగలుగుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలను సంతృప్తికరంగా రాయగలుగుతారు. ముఖ్యంగా ప్రింట్, మీడియాలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా వుండాలి. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
కన్య: స్త్రీలు విదేశీ వస్తువులపై ఆకర్షితులవుతారు. ఖర్చులు అధికమవుతాయి. బంధువుల ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. అవివాహితుల్లో నూతనోత్సాహం, పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. భాగస్వామిక సమావేశాల్లో మీ నిర్ణయాలను స్పష్టంగా వ్యక్తం చేయండి. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది.
 
తుల: రాజకీయ, పారిశ్రామిక పారిశ్రామిక రంగాల వారికి ఒక ప్రకటన సంతోషం కలిగిస్తుంది. ప్రయాణాలు, బ్యాంకు లావాదేవీళ్లో జాగ్రత్త. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్ల విషయంలో పునరాలోచన మంచిది. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్ల విషయంలో పునరాలోచన మంచిది.
 
వృశ్చికం: వస్త్ర, ఫ్యాన్సీ, పచారి, చిరు వ్యాపారులకు అనుకూలంగా వుంటాయి. విద్యార్థుల్లో మనోధైర్యం నెలకొనడంతో పాటు పై చదువుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ఉద్యోగస్తులకు అధికారులతో పర్యటనలు, అదనపు బాధ్యతలు స్వీకరించవలసి వస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం.
 
ధనస్సు: కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో చికాకులు తప్పవు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటానికి యత్నించండి. మీ కొచ్చిన సమస్యలు తాత్కాలికమే. ఇతరుల ముందు మీ కుటుంబ సమస్యలు ఏకరువు పెట్టడం మంచిది కాదని గ్రహించండి. ఇంట పెద్దమొత్తంలో ధనం ఉంచుకోవడం శ్రేయస్కరం కాదు. 
 
మకరం: వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి పురోగతిన సాగుతాయి. వివాదాస్పద విషయాల్లో మీ ప్రమేయం లేకుండా జాగ్రత్తపడండి. ఒక వ్యవహారం అనుకూలించడంతో అమితోత్సాహం చెందుతారు. విలువైన వస్తువుల కొనుగోలులో తొందరపాటు కూడదు. ఏ వ్యక్తినీ అతిగా విశ్వసించడం మంచిది కాదు. 
 
కుంభం: ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఓర్పు, పనియందు ధ్యాస ముఖ్యం. క్యాటరింగ్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ప్రయాణాల్లో అశాంతి, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. దంపతుల మధ్య అన్యోన్యత, గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. 
 
మీనం: ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో మెలకువ వహించండి. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గుర్తిస్తారు. వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకం. కుటుంబీకులు, ఆత్మీయుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. స్థిరాస్తి ఏదైనా అమ్మకం చేయాలనే మీ ఆలోచన వాయిదా వేయటం శ్రేయస్కరం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

08-05-2019 దినఫలాలు - మహావిష్ణువును ఆరాధించిన పురోభివృద్ధి...