Daily Horoscope

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

24-12-2019 మీ రాశి ఫలితాలు.. గౌరీదేవిని ఆరాధించినట్లైతే..? (video)

Advertiesment
Daily Horoscope
మేషం : ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు ప్రజా సంబంధాలు బలపడతాయి. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. పొదుపునకు అవకాశం తక్కువ. కొబ్బరి, పండ్లు, పూలపానీయ నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. స్త్రీలపై బంధువులు, పొరుగువారి ప్రభావం అధికం. 
 
వృషభం : మీ అతిథి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి. పెద్దలు, ఆత్మీయుల శుభాకాంక్షలు తెలుపుతారు. ఆదాయ వ్యయాల్లో చక్కని ప్రణాళికలతో ముందుకుసాగుతారు. ఆత్మీయులు, అయినవారి రాక సంతోషం కలిగిస్తుంది. అవివాహితులు కొత్త అనుభూతికి లోనవుతారు. శుభకార్యాలు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. 
 
మిథునం : విద్యార్థుల్లో మనోధైర్యం నెలకొంటుంది. అధిక ధనవ్యయం, ముఖ్యమైన పనులతో సతమతమవుతరు. ఒక వ్యవహర సానుకూలతకు బాగా శ్రమించాల్సివుంటుంది. అనుక్షణం ఒత్తిడి, హడావుడి లోనవుతారు. ఉద్యోగస్తులు బాధ్యతలు పెరుగుతాయి. స్త్రీలు విలాసవస్తువులు, ఆభరణాలు అమర్చుకుంటారు. 
 
కర్కాటకం : నూతన పెట్టుబడులు, వ్యాపారాలు లాభిస్తాయి. చెల్లింపులు, హామీలు, చెక్కుల జారీలో మెలకువ వహించండి. సహోద్యోగుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. శుభకార్యాల్లో బంధువుల ఆదరణ సంతోషం కలిగిస్తుంది. మతిమరుపుతో ఇబ్బందులు, చికాకులు ఎదుర్కొంటారు. వృత్తిపరంగా పురోభివృద్ధి సాధిస్తారు. 
 
సింహం : సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. వ్యాపారాల విస్తరణ, నూతన వ్యాపారాలు ప్రారంభించుటకు మీరు చేయు యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు ఆకస్మిక ప్రయాణం, ధనప్రాప్తి వంటి శుభఫలితాలున్నాయి. గృహ నిర్మాణ ప్లాన్లకు ఆమోదం లభిస్తుంది. 
 
కన్య : అవివాహితుల్లో నూతనోత్సాహం, పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో చక్కని అనుభవం గడిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాగలవు. మీ ఏమరుపాటు వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. స్త్రీలకు వాహన యోగం, ఆకస్మిక ప్రయాణం వంటి ఫలితాలున్నాయి. 
 
తుల : ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. వస్త్ర, బంగారు, ఫ్యాన్సీ మందుల వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. వేడుకలు, శుభకార్యాలు వినోదాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. విలువైన వస్తువుల కొనుగోలు విషయంలో అప్రమత్తత అవసరం. 
 
వృశ్చికం : రాబోయే ఖర్చులకు ముందుగానే ధనం సర్దుబాటు చేసుకుంటారు. గృహవాస్తు దోష నివారణ వల్ల మంచి ఫలితాలుంటాయి. మీ యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం లభిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు ఉన్నమాయి. వస్త్ర, బంగారు, వెండి, ఫ్యాన్సీ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. 
 
ధనస్సు : దంపతుల మధ్య బంధువుల ప్రస్తావన వస్తుంది. స్త్రీలకు విలాస వస్తువులు, అలంకారాల పట్ల వ్యామోహం అధికం. నిరుద్యోగులకు ఆశాజనకం. గృహంలో ఒక శుభకార్యం ఆడంబరంగా నిర్వహిస్తారు. ధనాదాయ వృద్ధి. వ్యవహార జయం వంటి సత్ఫలితాలున్నాయి. ఖర్చులకు సార్థకత, ప్రయోగం ఉంటాయి. 
 
మకరం : వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి నిలదొక్కుకుంటారు. మతిమరుపుతో ఇబ్బందులు, చికాకులు ఎదుర్కొంటారు. విదేశీయాన యత్నాల్లో చికాకులు, ఆటుపోట్లు తప్పవు. పనులు, ఇతర చెల్లింపుల్లో జాప్యం తగదు. అప్రయత్నంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. కటుంబీకుల తీరు కొంత మనస్తాపం కలిగిస్తుంది. 
 
కుంభం : ఆర్థిక, కుటుంబ సమస్యలకు చక్కని పరిష్కారం లభిస్తుంది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారం తెలుసకుంటారు. స్త్రీలు, షాపింగ్‌లోను, కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ సంతానం రేపటి మీ కార్యక్రమాలను రాతపూర్వకంగా ఉంచుకోవడం మంచిది. విద్య, ఉద్యోగ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. 
 
మీనం : వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. మీ సంతానం భవిష్యత్తు కోసం కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు పెరుగుతాయి. కార్యసాధనంలో అనుకూలత, కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ఖర్చలు, చెల్లింపుల్లో ఆచితూచి వ్యవహరించండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోమవారం నువ్వుల నూనెతో దీపమెలిగిస్తే?