Daily Horoscope

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుభోదయం... మీ రాశి ఫలితాలు 07-08-2017

మేషం : ఈ రోజు సోదరీమణులకు విలువైన కానుకలు అందిస్తారు. పత్రికా రంగాలలోని వారికి ఒత్తిడి, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. తల, కాళ్ళు, చేతులు, నరాలకు సంబంధ

Advertiesment
daily prediction
మేషం : ఈ రోజు సోదరీమణులకు విలువైన కానుకలు అందిస్తారు. పత్రికా రంగాలలోని వారికి ఒత్తిడి, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. తల, కాళ్ళు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. రాజకీయాల్లో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. 
 
వృషభం : ఈ రోజు ఆర్థిక విషయాల్లో జయం చేకూరుతుంది. కుటుంబీకుల మధ్య అవగాహన, ఏకాభిప్రాయం సానుకూలమవుతాయి. మీ కళత్ర మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. ప్రేమికుల తొందరపాటు చర్యలు సమస్యలకు దారితీస్తాయి. సోదరీ, సోదరులతో సమస్యలు తలెత్తుతాయి. సంఘంలో మీకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. 
 
మిథునం : ఈ రోజు సృజనాత్మక శక్తికి, మీ తెలివి తేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. అధికారులకు సాంస్కృతిక కార్యక్రమాల్లో క్షణం తీరిక ఉండదు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. బంధువుల రాక ఆనందాన్ని ఇస్తుంది. విందుల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం: ఈ రోజు ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో వారు అచ్చుతప్పులు పడటం వలన మాటపడాల్సి వస్తుంది. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. రిప్రజెంటివ్‌లకు ఒత్తిడి, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్క్రీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి.
 
సింహం : ఈ రోజు మీ యత్నాలకు ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్, వృత్తుల వారికి పురోభివృద్ధి. రావలసిన మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. మీ సంతానం మొండివైఖరి ఎంతో చికాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి.
 
కన్య : ఈ రోజు సోదరీ, సోదరులు శుభాకాంక్షలు అందజేస్తారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఎంతో శ్రమించిన మీదట కాని అనుకున్నది సాధించలేరు. మీ ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చించవలసి ఉంటుంది. విదేశాలు వెళ్లటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
తుల : ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. పాత మిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు మంచి గుర్తింపు లభిస్తుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. స్త్రీల మనోభావాలకు గుర్తింపు, ఆదరణ లభిస్తుంది.
 
వృశ్చికం : ఈ రోజు మీ ఆశయాలు, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. గత కొంత కాలంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కార మార్గం గోచరిస్తుంది. సంఘంలో వైద్య రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. ఒకేసారి అనేక ఖర్చులు మీదపడటంతో అసహనానికి లోనవుతారు.
 
ధనస్సు : ఈ రోజు సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు వెల్లివిరుస్తాయి. నిత్యావసర సరుకుల స్టాకిస్టులకు వేధింపులు తప్పవు. దూర ప్రయాణాల్లో చికాకులు తలెత్తుతాయి. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే స్త్రీల మనోవాంఛ ఫలిస్తుంది. కీలకమైన సమావేశాల్లో మితంగా సంభాషించండి. పాత వస్తువులను కొని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
మకరం : ఈ రోజు మీరు, మీ స్నేహితునితో కలిసి మీ లక్ష్యాన్ని చేరుకోవటానికి కృషి చేస్తారు. స్త్రీల అత్యుత్సాహం అనర్ధాలకు దారితీసే ఆస్కారం. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. మధ్య కలహాలు అధికమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. మొండి బాకీల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. 
 
కుంభం : ఈ రోజు స్థిరాస్తుల వ్యవహారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆకస్మికంగా ప్రయాణాలు సంభవిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల కోసం ధనం బాగుగా ఖర్చు చేస్తారు. 
 
మీనం : ఈ రోజు ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. రవాణా రంగాలలో వారికి మిశ్రమ ఫలితం కానవస్తుంది. ఇంటి స్థలాల బ్రోకర్లకు, ఏజెంట్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

7న తిరుమల ఆలయం మూసివేత.. ఎందుకో తెలుసా?