శుభోదయం : మీ రాశిఫలితాలు 14-08-2017
మేషం: ఈ రోజు ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవడం మంచిది. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దంపతుల మధ్
Publish Date: Mon, 14 Aug 2017 (05:52 IST)
Updated Date: Mon, 14 Aug 2017 (05:54 IST)
మేషం: ఈ రోజు ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవడం మంచిది. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దంపతుల మధ్య ఏకీభావం సాధ్యం కాదు. మీ సంతానం భవిష్యత్తు గురించి కొత్త పథకాలు వేస్తారు.
వృషభం : లిటిగేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. ఉద్యోగ బాధ్యతల్లో మార్పు, అధికారులతో పర్యటనలుంటాయి. వాదోపవాదాలకు దిగకుండా లౌక్యంగా మీ వ్యవహారాలు చక్కబెట్టుకోవలసి వుంటుంది. కుటుంబ అవసరాలకు, మీ సంతానం కోసం ఫీజులు, బిల్లులు చెల్లిస్తారు. పెద్దలతో ఏకీభవించలేకపోతారు.
మిథునం : వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి గడిస్తారు. బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ అవసరం. బంధువల రాకతో ఖర్చులు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకున్న విధంగా సమయానికి పూర్తి కాగలవు. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రావలసిన మొండిబాకీలు సైతం వసూలవుతాయి.
కర్కాటకం: ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. మీ పథకాలు, షాపుల అలంకరణ మంచి ఫలితాలిస్తాయి. విద్య సంస్థలలో వారికి, ఉపాధ్యాయులకు అనుకూలమైనకాలం. మిత్రులను కలుసుకుంటారు. అధికారుల హోదా పెరగడంతో పాటు స్థానచలనం ఉంటుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
సింహం : చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మీ సహాయం పొంది మిమ్మల్ని తక్కువ అంచనా వేయటం వల్ల ఆందోళనకు గురవుతారు. వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పై అధికారులతో మాటపడవలసివస్తుంది. విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్లలో విజయం సాధిస్తారు.
కన్య: భాగస్వామిక సమావేశాల్లో మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేయాలి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కొంతమంది మీ నుంచి పెద్ద మొత్తంలో ధనసహాయం అర్ధిస్తారు. విదేశీయత్నాల్లో శ్రమాధిక్యత, ప్రయాసలకు లోనవుతారు. స్త్రీలకు అలంకారాలు, గృహోపకరణాల పట్ల మక్కువ సన్నగిల్లుతుంది.
తుల : ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికమవుతుంది. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. వ్యాపార వర్గాల వారికి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం.
వృశ్చికం: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు దూరంగా వుండటం మంచిది. ప్రముఖులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఎరువుల వ్యాపారులు, రేషన్ డీలర్లకు అధికారుల తనిఖీలు ఆందోళన కలిగిస్తాయి.
ధనస్సు : రిజిస్ట్రేషన్లు, కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు అనుకూలిస్తాయి. వ్యవహార ఒప్పందాల్లో మొహమ్మాటాలకు తావివ్వకండి. పత్రికా రంగంలోని వారికి రచయితలకు అనువైన సమయం. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. వ్యాపారాల్లో పోటీని ధీటుగా ఎదుర్కొంటారు. తలపెట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు.
మకరం : వృత్తి ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఖర్చులు సామాన్యం. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. విదేశాలు వెళ్ళటానికి చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆప్తుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది.
కుంభం : ప్రభుత్వ కార్యాలయాల్లోని పనులు, కార్యక్రమాలు హడావుడిగా సాగుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. క్యాటరింగ్ రంగాల వారికి కలిసిరాగలదు. స్త్రీలకు పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త అవసరం. ఉద్యోగయత్నం సఫలీకృతులవుతారు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు.
మీనం : మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవాగాహన ముఖ్యం. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. విద్యార్థులు ఇతరులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు.
raman
Publish Date: Mon, 14 Aug 2017 (05:52 IST)
Updated Date: Mon, 14 Aug 2017 (05:54 IST)