శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 05-10-17
మేషం: విద్యుత్ రంగంలో వారు మాటపడక తప్పదు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్త
Publish Date: Thu, 05 Oct 2017 (09:02 IST)
Updated Date: Tue, 10 Oct 2017 (09:44 IST)
మేషం: విద్యుత్ రంగంలో వారు మాటపడక తప్పదు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. కీలకమైన వ్యవహారాల్లో మీరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది.
వృషభం : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలు కలిసిరాగలదు. బంధువులకు ఆర్థిక సాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. స్త్రీల ప్రతిభకు గుర్తింపు, సదవకాశాలు లభిస్తాయి.
మిథునం: వ్యాపార, ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. బంధువులతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. బంధువులతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. స్థిరాస్తుల కొనుగోళ్ళపై దృష్టి సారిస్తారు. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు.
కర్కాటకం: నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. బ్యాంకు వ్యవహారాలు, చెక్కులజారీలో ఏకాగ్రత అవసరం. ఆకస్మిక మిత్రుల కలయిక మీకెంతో సంతృప్తినిస్తుంది. మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురవుతారు. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు.
సింహం: ఉద్యోగస్తులకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల ముఖ్యమని గమనించండి. ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూ లేఖలు అందుకుంటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఒక దైవ కార్యం ఘనంగా చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది.
కన్య: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికి రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. సభలు, సమావేశాల్లో మీ అలవాట్లు, వ్యసనాలు అదుపులో ఉంచుకోవడం క్షేమదాయకం.
తుల: చిన్నతరహా పరిశ్రమలు, వృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. ప్రైవేట్ సంస్థల్లో వారికి ఓర్పు, ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. రావలసిన ధనం సమయానికి అందుకుంటారు.
వృశ్చికం: విద్యార్థినుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం వుంది. సంగీత కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. బంధువులు మీ నుంచి పెద్ద మొత్తంలో ధనసహాయం అర్ధిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది.
ధనస్సు: ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఆశాభంగం. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఊహించని ఖర్చుల వల్ల ఆటుపోట్లు, చికాకులు ఎదుర్కొంటారు. బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ అవసరం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారులకు సమస్యలు ఎదురైనా ఆదాయానికి కొదవ ఉండదు.
మకరం: కోర్టు పనులు మందకొడిగా సాగుతాయి. రాజకీయాల్లో వారికి అవకాశవాదులు అధికం అవుతున్నారని గమనించండి. ఖర్చులు అధికమవుతాయి. ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం అని గమనించండి. దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. దైవ, పుణ్య కార్యాలకు విరివిగా ధనం వ్యయం చేస్తారు.
కుంభం : కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. మీ మంచి కోరుకునే వారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. బంధువుల రాక వల్ల తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.
మీనం : ఉమ్మడి వ్యాపారాలు, నూతన పెట్టుబడుల ఆలోచన వాయిదా వేయండి. మీకు ఆందోళన కలిగించిన సమస్య తేలికగా సమసిపోతుంది. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. నగదు చెల్లింపుల్లో తొందరపడవద్దు. స్త్రీలకు టీవీ ఛానళ్ల కార్యక్రమంలో అవకాశం లభిస్తుంది.
raman
Publish Date: Thu, 05 Oct 2017 (09:02 IST)
Updated Date: Tue, 10 Oct 2017 (09:44 IST)