Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్షీరాభ్ధి ద్వాదశి విశిష్టత.. తులసీ కళ్యాణం ఎందుకు?

Advertiesment
Tulasi

సెల్వి

, మంగళవారం, 12 నవంబరు 2024 (21:51 IST)
కార్తీక మాసంలో ప్రతిరోజూ పవిత్రమే. అదీ కార్తీక శుద్ధ ఏకాదశి, క్షీరాభ్ధి ఏకాదశికి ప్రత్యేక విశిష్ఠ ఫలితాలున్నాయి. 13న కార్తిక మాస "క్షీరాబ్ది ద్వాదశి". కార్తిక శుక్ల శుద్ధ ఏకాదశినాడు శ్రీమహావిష్ణువు.. నిద్రలో నుంచి మేల్కొంటాడు. మరుసటి రోజు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీసమేతుడై, బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు. 
 
శ్రీమహా విష్ణువు దామోదరుడు అనే పేరుతో తులసిమాతను వివాహం చేసుకుంటాడు. అందుకే.. విష్ణు సంబంధమైన ఆలయాల్లో క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి దామోదరుల కల్యాణం జరుగుతుంది. 
 
పెళ్లైన దంపతులు దేవ దేవతల కల్యాణ వేడుకలను తిలకించి అక్షతలు వేసుకుంటే చాలా మంచిది. ఈ రోజున తులసీ కోట వద్ద పూజ తప్పనిసరి. తులసికోట దగ్గర మట్టిప్రమిదలో ఆవునెయ్యి పోయాలి. 9 వత్తులు వేసి దీపం పెట్టాలి. 
 
ఇంకా "ఓం బృందావనీయాయ నమః" అనే మంత్రం చదువుతూ తులసికోట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. క్షీరాబ్ది ద్వాదశి రోజు ఆకలితో అలమటిస్తున్న పేదవారికి పెరుగన్నం దానం ఇవ్వాలి. ఇలా దానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. 
webdunia
Lord Vishnu
 
ఈ రోజు తులసికోట వద్ద చలిమిడి దీపాలు వెలిగించాలి. గులాబీ పూలు, తెల్లటి పూలు తులసికోట దగ్గర ఉంచాలి. అలాగే ద్రాక్షపండ్లు, దానిమ్మ గింజలు, అరటి పండ్లు నైవేద్యంగా పెట్టాలి. ఈ రోజు ఎవరైనా తులసి పూజ చేసి భక్తితో దీపదానం చేస్తే వారు మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని వరం ఇచ్చాడని వ్యాసుడు వివరించినట్లు పురాణాలు చెప్తున్నాయి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింహాచలంపై శంఖు చక్ర నామాలు.. కొండకు హైలెట్‌