Publish Date: Tue, 05 Jan 2021 (05:00 IST)
Updated Date: Mon, 04 Jan 2021 (18:59 IST)
ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్ళే ముందు తమలపాకు నమలడం లేదా ఆకులు జేబులో ఉంచుకోవడం చేస్తే అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. అలాగే సోమవారం మీ ముఖాన్ని అద్దంలో ఒక్కసారి చూసుకుని ఇంట్లో నుంచి బయటకు రావాలి. వీలైతే కోడిగుడ్డు ఆకారంలో ఉండే అద్దాన్ని ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర అమర్చుకోవాలి.
మంగళవారం హనుమంతుడికి ఇష్టమైన మంగళవారం ఉదయం స్నానం చేసి, హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నోరు తీపి చేసుకోవాలి. బెల్లం తింటే మరీ మంచిది.
బుధవారం బయటకు వెళ్ళేటప్పుడు పుదీనా లేదా కరివేపాకు ఆకులు నోట్లో వేసుకోవాలి. ప్రతి బుధవారం ఇలా చేస్తే ఆరోగ్యంగానూ చాలా ప్రయోజనం వుంటుంది. గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు కొద్దిగా జీలకర్ర లేదా ఆవాలు నోట్లో వేసుకోవడం మంచిది. వాటిని నమల కుండా అలానే నోట్లో వుంచుకోవాలి. గుమ్మం దాటి బయటకు వెళ్లే వరకూ అలాగే వుంచాలి.
ఇక శుక్రవారం ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్ళాల్సి వస్తే పెరుగు తిని బయలుదేరాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అలాగే ప్రతి శుక్రవారం కనీసం రెండు టేబుల్ స్పూన్ల పెరుగు ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు తీసుకోవాలి. ప్రతి శనివారం కొద్దిగా అల్లం తురుము నేతితో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా సిరిసంపదలు మీ దరిచేరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.