Publish Date: Mon, 15 Oct 2018 (16:09 IST)
Updated Date: Mon, 15 Oct 2018 (16:20 IST)
మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సిరిసంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి అమ్మవారికి దీపారాధను నైవేద్యాలు చేయడం వలన అష్టైశ్వర్యాలు వెల్లివిరుస్తాయని విశ్వాసం. దానికి తోడుగా ఈ మంత్రాన్ని జపిస్తే...
''చతుర్భుజం చంద్రరూపా మిందిరా మిందు శీతలామ్
ఆహ్లాద జననీం పుష్టం శివాం శివకరీం సతీమ్''
ఈతిభాదలు తొలగిపోతాయి. ముఖ్యంగా లక్ష్మీదేవిని ప్రార్థించేటప్పుడు పూజామందిరంలో రంగు ముగ్గులు వేసి, వాటిపే దీపాలు వెలిగించుకోవాలి. ఇలా ప్రతి మంగళ, శుక్ర వారాల్లో చేస్తే అమ్మవారు తప్పకుండా ఆ ఇంటికి దర్శనపిస్తారని నమ్మకం.