Publish Date: Sat, 30 Mar 2019 (11:02 IST)
Updated Date: Sat, 30 Mar 2019 (13:22 IST)
శనివారం శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైన రోజుగా పండితులు చెప్తుంటారు. వైష్ణవులు శనివారం రోజున శ్రీహరిని నిష్ట నియమాలతో పూజించేవారని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత శనివారం రోజున శుచిగా స్నానమాచరించి తులసికోట ముందు నేతితో గాని, నువ్వుల నూనెతో గానీ దీపమెలిగించేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా తులసికోట ముందు దీపమెలిగిస్తే.. ఆ గృహంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడు కొలువుంటుందని నమ్మకం.
అలానే శనివారం సాయంత్రం శ్రీమన్నారాయణుని ఆలయాన్ని సందర్శించుకుని నేతితో దీపమెలిగించుకునే వారికి ఈతిబాధలు తొలగిపోయి సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయని పురోహితులు చెబుతున్నారు. శనివారం రోజు ఒక పూట మాత్రమే భుజించి, శ్రీ వేంకటేశ్వర స్వామి, హనుమంతుడిని ధ్యానించే వారికి శనిగ్రహ ప్రభావంచే ఏర్పడే దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.
ఇంకా తొమ్మిది వారాల పాటు నారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించుకుని, విష్ణుమూర్తి ఆలయాన్ని తొమ్మిది సార్లు ప్రదక్షణ చేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
webdunia
Publish Date: Sat, 30 Mar 2019 (11:02 IST)
Updated Date: Sat, 30 Mar 2019 (13:22 IST)