కుమార్తెకు నిశ్చితార్థమైంది.. అతనితో తిరుగుతోంది.. తొందరపడుతుందేమో...
ఇటీవలే మా కుమార్తెకు నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత నుంచి వారిద్దరు చాలా చనువుగా తిరుగుతున్నారు. ఒకరినొకరు హగ్ చేసుకోవడం కళ్లారా చూశా. అప్పటి నుంచి నాకు ఓ సందేహం ఏర్పడింది. వీరిద్దరు వివాహానికి ముందే లైంగికంగా కలుస్తారేమోనని బెంగ పట్టుకుంది. ఏం చేయా
Publish Date: Fri, 22 Sep 2017 (21:33 IST)
Updated Date: Fri, 22 Sep 2017 (21:34 IST)
ఇటీవలే మా కుమార్తెకు నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత నుంచి వారిద్దరు చాలా చనువుగా తిరుగుతున్నారు. ఒకరినొకరు హగ్ చేసుకోవడం కళ్లారా చూశా. అప్పటి నుంచి నాకు ఓ సందేహం ఏర్పడింది. వీరిద్దరు వివాహానికి ముందే లైంగికంగా కలుస్తారేమోనని బెంగ పట్టుకుంది. ఏం చేయాలి. ఈ విషయం నా కుమార్తెతో ఎలా చర్చించాలి?
సాధారణంగా ఒక యువతికి నిశ్చితార్థం అయిన తర్వాత తనకు కాబోయే భర్తతో చనువుగా మాట్లాడుకోవడం, వీలు దొరికితే సినిమాలు, షికార్లకు వెళ్లడం ఈ కాలంలో సర్వసాధారణం. అంతమాత్రానా వారు లైంగిక సంబంధం పెట్టుకుంటారన్న బెంగ అవసరంలేదు. ఇలా చనువుగా వుండటం వల్ల కాబోయే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు అవకాశం కుదురుతుంది.
మీ కుమార్తె పెళ్లికి ముందే తొందరపడుతుందా లేదా అనేది మీ పెంపకంపై ఆధారపడి వుంటుంది. ఒకవేళ అలా చేస్తే దానివల్ల వచ్చే ఇబ్బందులు అమ్మాయే భరించాల్సి ఉంటుంది కనుక ఆ విషయాలు ఇతరుల జీవితాలను ఉదాహరణగా చూపుతూ చెబితే పిల్లలు అర్థం చేసుకుంటారు. అలా పరోక్షంగా హెచ్చరించండి.
ivr
Publish Date: Fri, 22 Sep 2017 (21:33 IST)
Updated Date: Fri, 22 Sep 2017 (21:34 IST)