ఆ 21 మహా దోషాలు లేకపోతేనే సత్ఫలితాలు... ఏంటవి?
ఏ పని చేపట్టేందుకైనా ముందుగా శుభముహూర్తం చూసుకోవడం భారతీయ సంప్రదాయం, మృత్యు, అగ్ని, రాజ, చోర, రోగ దోష రహితమైన సమయాన్ని అంటే పంచకరహితమైన సమయాన్ని శుభముహూర్తంగా నిర్ణయిస్తారు. పంచక రహితం చేయడంతో పాటు ఏకవింశతి మహా దోషాలు లేని సమయమే శుభముహూర్తానికి అర్హత
Publish Date: Sat, 20 Jan 2018 (22:51 IST)
Updated Date: Sat, 20 Jan 2018 (22:55 IST)
ఏ పని చేపట్టేందుకైనా ముందుగా శుభముహూర్తం చూసుకోవడం భారతీయ సంప్రదాయం, మృత్యు, అగ్ని, రాజ, చోర, రోగ దోష రహితమైన సమయాన్ని అంటే పంచకరహితమైన సమయాన్ని శుభముహూర్తంగా నిర్ణయిస్తారు. పంచక రహితం చేయడంతో పాటు ఏకవింశతి మహా దోషాలు లేని సమయమే శుభముహూర్తానికి అర్హత పొందుతుంది.
ఏకవింశతి అంటే 21 మహాదోషాలు ఏమిటో చూద్దాం. 1. పంచాంగ శుద్ధి, 2. సూర్య సంక్రాంతి, 3. కర్తరి, 4. దుష్ట స్థానాలలో చంద్రస్థితి, 5. ఉదయాస్త దోషం, 6. దుర్ముహూర్తం, 7. గండాంతరం, 8. భృగుషట్కం, 9. కుజాష్టకం, 10. అష్టమ లగ్నం, 11. వర్జ్యం 12. కుజ నవాంశ, 13. వారదోషం, 14. ఏకార్గళం, 15. గ్రహణోత్పాదక దోషం, 16. కూరవిద్ద నక్షత్రం, 17. క్రూర సంయుత దోషం, 18. అకాల గర్జిత దోషం, 19. మహాపాతం, 20. వైధృతి, 21. క్రూర గ్రహ దోషం. ఈ 21 దోషాలు లేని ముహూర్తమే శుభ ముహూర్తమై సత్ఫలితాలను ఇస్తుంది.
chj
Publish Date: Sat, 20 Jan 2018 (22:51 IST)
Updated Date: Sat, 20 Jan 2018 (22:55 IST)