Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి...?

Advertiesment
white rice
, బుధవారం, 13 మార్చి 2019 (15:12 IST)
ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదు ఇబ్బందులు కలుగవు. ఎంత పేదరికం ఉన్నా త్వరలోనే శ్రీమంతులు అవుతారు. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి. తెల్లని అన్నానికి పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాలు చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి.

1. ఉష్ణ సంబంధిత వ్యాధులు ఉంటే ఆదివారం చేస్తే మంచిది. రక్తానికి, రక్తపోటుకు సంబంధించిన వ్యాధులు ఉంటే మంగళవారం పూజలు చేయడం మంచిది. బుద్ధికి, నరాలకు సంబంధించిన వ్యాధులు ఉండేవారు బుధవారం చేయాలి. అన్ని రకాల ఉదర సంబంధ వ్యాధులు ఉండే వారు గురువారం నాడు పైన చెప్పిన విధంగా చేస్తే తప్పక ఫలితం ఉంటుంది.
 
2. తెల్ల అన్నం, శెనగపప్పు వేసి పాయసం చేసి ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే ఆ ఇంట్లో అందరూ ప్రేమ, అభిమానాలను కలిగి ఉంటారు. చాలా వరకు శాంతి లభిస్తుంది. మనస్సులో ఉండే భయం, భీతి, బెదిరింపులన్నీ తొలగిపోతాయి.
 
3. తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శనీశ్వరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులను పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి. అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చి, అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది.
 
4. సరిగా అన్నం తినని వారికి తెల్ల అన్నం పసుపు, కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి మూడు దార్లు కలిసే చోట పెట్టి వస్తే ఎటువంటి అన్నం దిష్టి అయినా తొలగిపోతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

13-03-2019 బుధవారం దినఫలాలు - పరిచయాలు మీ పురోభివృద్ధికి ...