Publish Date: Mon, 09 Sep 2019 (21:10 IST)
Updated Date: Mon, 09 Sep 2019 (21:12 IST)
చాలామంది తీపి పదార్థాలను స్వీట్ షాపుల్లో కొంటుంటారు. కానీ వాటిని ఇంట్లోనే తయారుచేసుకుంటే రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇప్పుడు తీయని లడ్డూలను ఎలా తయారు చేయాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు:
బూందీ కోసం శెనగపిండి - 2 కప్పులు
రవ్వ - 2 టేబుల్ స్పూన్లు
ఫుడ్ కలర్ - పావు టీ స్పూన్
నీళ్లు - ఒకటిన్నర కప్పు
నూనె - తగినంత
పంచదార పాకం కోసం
పంచదార- ఒక కప్పు
ఫుడ్ కలర్ - అర టీ స్పూన్
నీళ్లు - అరకప్పు
యాలకుల పొడి - పావు టీ స్పూన్
జీడిపప్పు - నాలుగైదు పలుకులు
పిస్తా - నాలుగైదు పలుకులు
తయారీ విధానం:
ముందుగా ఒక పాత్రలో నీళ్లు పోసి పంచదార వేసి మరిగించి పానకం తయారుచేసుకోవాలి. అందులో యాలకుల పొడి, జీడిపప్పు, పిస్తా పప్పు, ఫుడ్ కలర్ వేసి పక్కన పెట్టుకోవాలి.
మరొక పాత్రలో నూనె పోసి వేడి చేయాలి. శెనగపిండిలో నీళ్లు పోసి కాస్త చిక్కగా వుండేలా చూసుకోవాలి. రంధ్రాలు వుండే జాలీ తీసుకుని శెనగపిండిన అందులో నుంచి నూనెలో వేయాలి. కాస్త వేగాక బూందీని నూనెలో నుంచి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు పంచదార పానకంలో బూందీ వేయాలి. కాసేపు ఆగితే పంచదార పానకం బూందీకి పట్టేస్తుంది. తర్వాత బూందీని అరచేతిలో కొద్దికొద్దిగా తీసుకుంటూ లడ్డూలుగా ఒత్తుకోవాలి.
సిహెచ్
Publish Date: Mon, 09 Sep 2019 (21:10 IST)
Updated Date: Mon, 09 Sep 2019 (21:12 IST)