Publish Date: Sun, 23 Dec 2018 (10:42 IST)
Updated Date: Sun, 23 Dec 2018 (10:43 IST)
తెలంగాణా రాష్ట్రంలోని పలు ప్రాంతాలను చలి వణికిస్తోంది. ముఖ్యంగా అదిలాబాద్, హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో చలి తీవ్రంగా ఉంది. ఉదయం వేళ గ్రామాలు, పట్టణాల్లో పొగమంచు కమ్ముకుంటోంది. ఆదిలాబాద్ వాసుల్ని చలి మరింతగా వణికిస్తోంది.
ఈ జిల్లాలో శనివారం ఈ సీజన్లోనే అతి తక్కువగా 4.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రత దృష్ట్యా కలెక్టర్ కార్యాలయం, పభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల వేళల్లో మార్పులు చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడ్రోజులుగా పొగమంచు కమ్మేసింది. ఉత్తరాది నుంచి చలిగాలులు వీస్తుండటం వల్ల జనం ఇబ్బంది పడుతున్నారు.
Publish Date: Sun, 23 Dec 2018 (10:42 IST)
Updated Date: Sun, 23 Dec 2018 (10:43 IST)