Publish Date: Mon, 11 Nov 2019 (16:27 IST)
Updated Date: Mon, 11 Nov 2019 (16:32 IST)
గ్రేటర్ సిటీ పొల్యూషన్ పై హైకోర్టులో ఎమ్ ఆదిత్య పిటీషన్ దాఖలు చేసారు. పిటిషనర్ తరపు రాపోలు భాస్కర్ వాదనలు వినిపించారు. నగరంలో వాహనాలు పెరగడం వలన శబ్ద, వాయు కాలుష్యం పెరుగుతోంది. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా జంట నగరాల్లో రాయల్ ఎంఫైల్డ్ అనేక బైక్స్ వల్ల విపరీతంగా శబ్దకాలుష్యం వస్తుందన్న పిటిషనర్ పేర్కొన్నారు.
అంతే కాకుండా... శబ్ద, వాయు కాలుష్యం వల్ల మహిళలు గర్భస్రావం, ఇతర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియచేసారు. దేశంలో ఢిల్లీ తరువాత హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం పెరిగే అవకాశం ఉంది.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, మున్సిపల్ కమిషన్, డీజీపీ, రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్స్‌కి హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్ట్ ఆదేశించింది. కోర్ట్ తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది.