Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కారులో మూడు ముళ్లు.. మైకులో మంత్రాలు.. సిద్ధిపేటలో వెరైటీ మ్యారేజ్

Advertiesment
siddhipeta
కరోనా వైరస్ నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా పెళ్ళిళ్లు జరిగిపోతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా మాస్క్ ధరించటం… భౌతిక దూరం పాటించటం…శానిటైజర్‌తో చేతులు శుభ్ర చేసు కోవటం వంటివి ఇప్పటికే అందరూ పాటిస్తున్నారు. 
 
తాజాగా కరోనా వేళ పెళ్లి చేసుకున్న జంటకు…ఒక పురోహితుడు దూరం పాటిస్తూ కారులో కూర్చుని మైక్ లో మంత్రాలు చదువుతూ వివాహ తంతు ముగించిన ఘటన సిధ్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కోహెడకు చెందిన సటికం భాగ్య- మల్లేశం దంపతుల కుమార్తె సౌమ్య వివాహం తంగళ్లపల్లికి చెందిన కృష్ణమూర్తితో కోహెడలో ఆదివారం జరిగింది. ఈ వివాహాన్ని పురోహితుడు ప్రసాద్‌రావు శర్మ.. మండపానికి వచ్చి కారులో వచ్చి…దురంగా కారులోనే కూర్చుని మంత్రాలు చదివి కార్యక్రమాన్ని నిర్వహించారు. 
 
మైక్‌ ద్వారా అన్నీ వివరంగా చెపుతూ కళ్యాణ వేదిక పై వధూవరులతో కార్యక్రమం జరిపించగా వరుడు వధువు మెడలో తాళి కట్టాడు. మొత్తానికి కరోనా వేళ చిత్ర విచిత్రాతి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

120 మిలియన్‌ డాలర్లను సమీకరించిన మోగ్లిక్స్, యునికార్న్‌ క్లబ్‌లో చేరిక