Publish Date: Thu, 04 Apr 2019 (20:48 IST)
Updated Date: Thu, 04 Apr 2019 (20:50 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమా పూణెలో షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, రాంచరణ్‌తో పాటు అజయ్ దేవగన్, అలియాభట్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించడానికి డైరెక్టర్ రాజమౌళి ప్లాన్ చేసారు. అయితే... ఎవరూ ఊహించని విధంగా పూణె షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యింది అంటూ చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా తెలియచేసింది.
ఎందుకు అలా ట్వీట్ చేసిందంటే.. రామ్ చరణ్ జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్నప్పుడు కాలుకి గాయాలయ్యాయి. ఈ గాయాల వలన మూడు వారాల పాటు షూటింగ్ ఆపేసినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. దానయ్య నిర్మిస్తోన్న భారీ చిత్రాన్ని 2020 జులై 30న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. మూడు వారాల షూటింగ్ బ్రేక్ వలన చెప్పిన డేట్‌కి రిలీజ్ అవుతుందా..? అవదా..? అనే సందేహాలు వస్తున్నాయి. మరి.. ఏం జరగనుందో చూడాలి.