Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్నడ ఇండస్ట్రీలో విషాదం.. ఇంటిలోనే ఉరేసుకున్న దర్శకుడు...

Advertiesment
guru prasad

ఠాగూర్

, ఆదివారం, 3 నవంబరు 2024 (16:10 IST)
కన్నడ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. బెంగుళూరులోని తన నివాసంలోనే ఓ సినీ దర్శకుడు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన చిత్రపరిశ్రమలో షాకింగ్‌కు గురిచేసింది. దర్శకుడుగానేకాకుండా నటుడుగా, కథా రచయితగా రాణిస్తున్న గురు ప్రసాద్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే, మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. గురు ప్రసాద్ రెండు మూడు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. అలాగే, ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. 
 
ఈయన మఠం, ఎద్దేలు మంజునాథ, రంగనాయక వంటి అనేక చిత్రాలకు దర్శకత్వం వహించాు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డును సైతం అందుకున్నారు. బాడీగార్డ్, కుష్క, విజిల్, హుడుగురు, మైలాఠీ, జిగర్తాండ వంటి పలు చిత్రాల్లో నటించిన ఆయన ప్రేక్షకులను మెప్పించారు. ఇక హుడుగారు, విజిల్, సూపర్ రంగా చిత్రాలకు సంభాషణలను అందించారు. గురు ప్రసాద్ మరణంపై కన్నడ సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈయనకు ఇటీవలే వివాహం జరిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరన్‌తో అదరగొట్టింది.. కానీ అక్కడ దొరికిపోయిన సాయి పల్లవి