Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

Advertiesment
kenisha francis

ఠాగూర్

, సోమవారం, 12 మే 2025 (23:04 IST)
కోలీవుడ్ హీరో రవి మోహన్, బెంగుళూరుకు చెందిన గాయని కెనీషా ఫ్రాన్సిస్‌తో రిలేషన్‌లో ఉన్నట్టు ఎంతోకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని వారిద్దరూ పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. అయితే, తాజాగా చెన్నైలో జరిగిన ఓ వివాహ వేడుకకు కెనీషా - రమి మోహన్‌లు ఒక్కటిగా హాజరుకావడం ఇపుడు ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్టయింది. దీంతో రవి సతీమణి ఒక స్టేట్మెంట్ రిజీల్ చేశారు. దీనిపై కెనీషా తాజాగా స్పందించారు. ఏదైనా ఉంటే నేరుగా తనకే చెప్పమన్నారు. అంతేకాకుండా, ఆర్తికి సోర్టు చేస్తూ తనపై విమర్శలు చేస్తున్న హీరోయిన్ల ఉద్దేశించి కూడా ఆమె మాట్లాడారు. ఎవరి పని వాళ్ళు చూసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. 
 
"నాతో ఏదైనా చెప్పాలనుకుంటే నన్నే సంప్రదించండి. నేరుగా నా ముఖంపైనే చెప్పండి. మీరు ఏం అనుకుంటున్నారో నాక్కూడా తెలుస్తుంది కూడా. పీఆర్‌లను ఉపయోగించాల్సిన అవసరం లేదు. సొంత విషయాలు పట్టించుకోవడం మానేసి ఎవరైతే కేకలు వేస్తున్నారో ఒక్కసారి నా ముందుకు రండి. ఇతరుల దృష్టిని ఆకర్షించాలని మీరందరూ ఇపుడు కోరుకుంటున్నారని నాకు అనిపిస్తుంది. మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ అందరూ ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నా. మీరందరూ సపోర్టు అందిస్తున్నందుకు ధన్యవాదాలు" అని ఆమె రాసుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Bhadrakali: భద్రకాళీ అమ్మవారి ఆలయం- ఏకశిలపై అమ్మవారు.. కోహినూర్ వజ్రం విశిష్టత