Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Advertiesment
chiranjeevi - venkatesh

ఠాగూర్

, సోమవారం, 1 డిశెంబరు 2025 (10:34 IST)
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. ఇందులో మరో స్టార్ హీరో నటించనున్నారు. ఆయన ఎవరో కాదు.. విక్టరీ వెంకటేష్. వీరిద్దరూ కలిసి ఈ చిత్రంలో ఓ పాటకు డ్యాన్స్ వేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే అప్డేట్‌ను వెల్లడించింది.
 
ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక గీతంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేశ్ కూడా కలిసి స్టెప్పులేస్తున్నారు. గచ్చిబౌలిలో వేసిన భారీ సెట్‌లో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. సినిమా చరిత్రలో చిరంజీవి, వెంకటేశ్ కలిసి డ్యాన్స్ చేయడం ఇదే తొలిసారి కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 
సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన ఎలక్ట్రిఫైయింగ్ బీట్స్‌కు, 500 మందికి పైగా డ్యాన్సర్లతో ఈ పాటను ఎంతో గ్రాండ్గా చిత్రీకరిస్తున్నారు. సెట్లో ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణం, వారి ఎనర్జీ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
 
ఈ చిత్రంలో వెంకటేశ్ ఓ కీలకమైన అతిథి పాత్రలో కనిపించనున్నారు. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, 'సైరా నరసింహారెడ్డి', 'గాడ్ ఫాదర్' తర్వాత వీరిద్దరి కాంబినేషనులో వస్తున్న మూడో సినిమా ఇది. త్వరలోనే చిరంజీవి, నయనతారపై చిత్రీకరించిన ఒక రొమాంటిక్ పాటను విడుదల చేసేందుకు కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ