Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంత్రి సీతక్క ఆవిష్కరించిన నిన్ను నన్ను కన్న ఆడదిరా సాంగ్

Advertiesment
Minister Seethakka, Ramana Reddy, Ali, Kamna, Manjula, Zubeda Ali

డీవీ

, గురువారం, 9 జనవరి 2025 (15:46 IST)
Minister Seethakka, Ramana Reddy, Ali, Kamna, Manjula, Zubeda Ali
దర్శకుడు నిర్మాత రమణారెడ్డి ఆధ్వర్యంలో నిన్ను నన్ను కన్న ఆడదిరా సాంగ్ షూట్ చేశారు. దానిని తెలంగాణ మంత్రి సీతక్క ఆవిష్కరించారు. అలీ, కామ్న తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో అలీ మాట్లాడుతూ,ఈ పాట చేయడానికి ముఖ్య కారణం మనం ప్రస్తుతం బయట చూస్తున్న పరిస్థితులు. క్యాన్సర్ కంటే దారుణంగా వ్యాపిస్తుంది ఈ రేప్ అనే వ్యాధి. నాకు ఈ పాట వినగానే యమలీల సినిమాలో పాట గుర్తొచ్చింది. దర్శకుడు రమణా రెడ్డి ఇక్కడ నుండి అమెరికా వెళ్లి మన దేశానికి ఏమైనా చేయలని అనుకుని తిరిగి వచ్చి ముందుగా ఈ పాటతో మొదలు పెట్టాడు. 
 
పాట విన్న వెంటనే నేను ఈ పాటని మన రాష్ట్రానికి, ఆడవారికి డెడికేట్ చేయాలి అనుకున్నాము. ఈ పాట పూర్తిగా అన్ని చానల్స్, ఆడియో కంపెనీలకు ఉచితం. కేవలం మంచి అనేది అందరికీ వెళ్ళాలి అనే ఉద్దేశంతో చేశాం. ఈ పాట మూడు మతాల వారు ఒక మెసేజ్ తో ఇస్తే బాగ వెళ్తుంది అని ఈ విధంగా షూట్ చేయడం జరిగింది. అలాగే ఈ పాటలో నటించేందుకు ముంబై నుండి వచ్చినందుకు హీరోయిన్ కామ్నా గారికి ధన్యవాదాలు. నా సోదరి సమానురాలు సీతక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
 
సీతక్క మాట్లాడుతూ,బ ఒక అద్భుతమైన ఆలోచనతో సమాజంలో జరిగే దురభిప్రాయంతో ఉన్న ఈ పని చేయకూడదు అనే ఉద్దేశంతో వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. రమణ రెడ్డి గారికి, ఆలీ గారికి, చిన్న వయస్సులో పెద్ద బాధ్యత కలిగిన కామ్నా గారికి కృతజ్ఞతలు. కామంతో కళ్ళు మూసుకునిపోయి మృగంలా ప్రవర్తించే వారిలో మార్పు రావాలి. కులం, మతం, వృత్తితో సంబంధం లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. స్నేహితుడు అని నమ్మి వచ్చిన వారిని, వయస్సుతో సంబంధం లేకుండా అలాంటి అత్యాచారాలు చేస్తున్నారు. ఇప్పటికే దీనిని అరికట్టడానికి ప్రభుత్వం తరుపున ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈ పాట ఒక మంచి తొలి అడుగులా కనిపిస్తుంది. అత్యాచారం చేసే వారి వల్ల వారి సొంత కుటుంబం కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పాటలు వల్ల సమాజానికి మార్పు రావడానికి చాల వేగంగా ప్రజలలోకి వెళ్తుంది. ఈ పాట అందరిలో మార్పును తీసుకొస్తుంది అని కోరుకుంటున్నాను. ప్రజల అందరికీ ఈ పాట వెళ్లే విధంగా సహాయపడింది. ఈ పాట వల్ల మార్పు వస్తుంది అని అనుకుంటున్నాను. అలాగే చివరిగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.  
 
దర్శకుడు నిర్మాత రమణారెడ్డి మాట్లాడుతూ,  ఈ పాట సమాజానికి మంచి చేసే విధంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్కే న్యూస్ అధినేత బొల్లా రామ కృష్ణ, నటుడు శ్రీనివాస్, నటి మంజుల లతో పాటు శ్రీమతి జుబేదా ఆలీ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిధి అగర్వాల్‌ను చంపుతామంటూ బెదిరిస్తున్న అగంతకుడు!!