Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా ఆయనతో పెట్టుకుంటే అంతే అంటున్న రమా రాజమౌళి

బాహుబలి వంటి అద్భుత ఇతివృత్తంతో మన కళ్ల ముందు ఒక మంత్రజగత్తును చూపించి తన్మయంలో ముంచెత్తిన దర్శకధీరుడు రాజమౌళి నిజజీవితంలో దే్న్నీ పట్టించుకోని అచ్చమైన ప్రొఫెసరే అంటున్నారు రమా రాజమౌళి. సినిమా నిర్మాణంలో ఆచి తూచి గిరిగీసి మరీ ఖర్చుపెట్టే రాజమౌళి వాస్

Advertiesment
Rama Rajamouli
హైదరాబాద్ , గురువారం, 13 ఏప్రియల్ 2017 (08:31 IST)
బాహుబలి వంటి అద్భుత ఇతివృత్తంతో మన కళ్ల ముందు ఒక మంత్రజగత్తును చూపించి తన్మయంలో ముంచెత్తిన దర్శకధీరుడు రాజమౌళి నిజజీవితంలో దే్న్నీ పట్టించుకోని అచ్చమైన ప్రొఫెసరే అంటున్నారు రమా రాజమౌళి. సినిమా నిర్మాణంలో ఆచి తూచి గిరిగీసి మరీ ఖర్చుపెట్టే రాజమౌళి వాస్తవ జీవితంలో డబ్బు విలువ గురించి ఏమీతెలీని వాడిలాగే వ్యవహరిస్తుంటాడనే సత్యాన్ని రమ మీడియాతో పంచుకున్నారు. ఆరోపణ, అభిమానం అన్నీ కలగలిపి రాజమౌళి వ్యక్తిగత జీవితం గురించి తొలిసారిగా బయటి ప్రపంచంతో పంచుకున్న రమ ఇంటర్వ్యూ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో హల్ చల్ సృష్టిస్తోంది. పైగా మా ఆయనతో కలిసి మీరు హోటల్‌కి వెళ్లారంటే బిల్లు మొత్తం మీమీదే పడుతుంది జాగ్రత్త అంటూ మైల్డ్ వార్నింగ్ కూడా ఇచ్చేశారు రమ.
 
ఆమె మాటల్లోనే చెప్పాలంటే.. తను ఎంత సంపాదిస్తున్నాడనేది కూడా రాజమౌళి అసలు పట్టించుకోడు. చెక్‌ల మీద సంతకం పెట్టమంటే.. ఫ్యాన్స్‌కు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చినట్టు పిచ్చిపిచ్చిగా పెడుతుంటాడు. చాలాసార్లు చెక్‌లు రిజెక్ట్‌ అయి వెనక్కి వచ్చాయి. జేబులో కూడా అస్సలు డబ్బులుండవు. ఆయన్ని ఎవరైనా బయట రెస్టారెంట్‌కు తీసుకెళ్తే.. బిల్‌ కూడా వాళ్లే కట్టాలి. ఎందుకంటే తన జేబులో డబ్బులు ఉన్నాయో, లేవో చూసుకోకుండా బయటకు వెళ్లిపోతాడు రాజమౌళి. అందుకే డ్రైవర్‌ వద్ద కొంత డబ్బు, ఏటీఎమ్‌ కార్డ్‌ పెడుతుంటాను. ఇంటికి సంబధించిన వ్యవహారాలన్నీ నేనే చేసుకుంటాన’ని చెప్పింది రమ.
 
సరిగ్గా ఇది మతిమరుపు ప్రొఫెసర్లందరి లక్షణమే కదూ.. సృజనాత్మక రంగంలో సీరియస్‌గా పనిచేసేవారు సాధారణ సామాజిక అంశాలను పట్టించుకోరనే విషయం ఔన్‌స్టెయిన్ నుంచి మేధావులందరూ నిరూపించేసారు. ఇప్పుడు రాజమౌళి కూడా వారి సరసన నిలబడినట్లే మరి.
 
కానీ రామోజీ ఫిల్మ్ సిటీలో గత నెల చివరలో జరిగిన బాహుబలి-2 సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో రాజమౌళి గురించి అద్భుతమైన వ్యాఖ్య చేశారు చిత్రనిర్మాత శోభు. తనలోని ఇతర క్వాలిటీలను ఏకరువు పెడుతూనే డబ్బు విషయంలో కరప్ట్ కాని అంటే చెడిపోని అరుదైన దర్సకుడు రాజమౌళి అంటూ ఆకాశానికి ఎత్తేశారు శోభు.
 
తన సంపాదనను ఏమాత్రం పట్టించుకోకపోవడం. ఇతరుల డబ్బును ఆచి తూచి ఖర్చు పెట్టడం...ఈ కాలంలో ఎంత గొప్ప విలువో కదా.. నిర్మాత నమ్మకాన్ని ఇలా సంపాదించాడు కాబట్టే బాహుబలి సినిమాకు వందల కోట్లు ఖర్చవుతున్నా ఆ నిర్మాతలు వెరవలేదు. వెనక్కు తగ్గలేదు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరోయిన్‌నీ నేనే.. విలన్నీ నేనే.. సింగర్‌నీ నేనే.. మీకేమైన ఆభ్యంతరమా అంటున్న నేత్రసుందరి