Daily Horoscope

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిస్ట‌ర్ బెగ్గ‌ర్ గా సంపూర్ణేష్ బాబు

Advertiesment
Mr. Beggar
Satyaprakash, Vadla Janarthan, Adviti Shetty, Sampoornesh Babu, Poluri Ghatikachalam etc.
సంపూర్ణేష్ బాబు, అద్వితి శెట్టి హీరో హీరోయిన్లుగా న‌టించ‌నున్న `మిస్ట‌ర్ బెగ్గ‌ర్` సినిమా సోమ‌వారంనాడు ప్రారంభ‌మైంది. వ‌డ్ల జ‌నార్థ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో గురురాజ్, కార్తిక్ నిర్మిస్తున్నారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి న‌టుడు స‌త్య ప్ర‌కాష్ క్లాప్ కొట్ట‌గా  కార్తీ మూవీ మేక‌ర్స్ అధినేత, నిర్మాత రాజు కెమెరా స్విచాన్ చేశారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు  వి. స‌ముద్ర గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
 
 అనంత‌రం న‌టుడు స‌త్య ప్ర‌కాష్ మాట్లాడుతూ...``ఈ చిత్రంలో నేను భ‌ద్ర అనే పాత్ర‌లో మెయిన్ విల‌న్ గా న‌టిస్తున్నా. యువ నిర్మాత‌లు, యువ టెక్నీషియన్స్ ప‌ని చేస్తోన్న ఈ చిత్రంలో న‌టించ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు.
 
 హీరో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ,  ఈ సినిమా గోవా బ్యాక్ డ్రాప్ లో చాలా వ‌ర‌కు ఉంటుంది. వ‌చ్చే నెల‌లో గోవా షెడ్యూల్ ప్లాన్ చేశాం.  `హృద‌య కాలేయం` చిత్రం నుంచి న‌న్ను ఇప్ప‌టి వ‌ర‌కూ ఆద‌రిస్తూ వ‌చ్చారు. ఈ సినిమాను కూడా అదే విధంగా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా.  ఎన్నో పెద్ద చిత్రాల్లో న‌టించిన స‌త్య‌ప్ర‌కాష్ గారితో న‌టించ‌డం చాలా హ్యాపీ. ఇంకా  చాలా మంది సీనియ‌ర్ ఆర్టిస్ట్స్ మా సినిమాలో న‌టిస్తున్నారు``అన్నారు.
 
ర‌చ‌యిత‌ పోలూరి ఘ‌టికాచ‌లం మాట్లాడుతూ...``ఈ క‌థ పైన  దాదాపు ఏడాది కాలం వ‌ర్క్ చేశాం. స్క్రిప్ట్ చాలా బాగొచ్చింది. ఇందులో హీరో పాత్ర‌, విల‌న్ పాత్ర రెండూ చాలా డిఫ‌రెంట్ గా ఉంటాయి.  యంగ్ ప్రొడ్యూస‌ర్స్, యంగ్ టెక్నీషియ‌న్స్ ఈ సినిమాకు ప‌ని చేస్తున్నారు`` అన్నారు.
 
ద‌ర్శ‌కుడు వ‌డ్ల జ‌నార్థ‌న్ మాట్లాడుతూ...``మిస్ట‌ర్ బెగ్గ‌ర్ టైటిల్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. స‌ర‌దా స‌ర‌దాగా సాగే కుటుంబ క‌థా చిత్రానికి మంచి వినోదం పొందు ప‌రిచాము. సంపూ గారి మేనరిజానికి త‌గ్గ‌ట్టుగా  స్క్రిప్ట్ రెడీ చేశాం.  బాంబే, చెన్నై, గోవాల్లో సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ ప్లాన్ చేశాం``అన్నారు.
 
కార్తీ మూవీ మేక‌ర్స్ అధినేత, నిర్మాత రాజు మాట్లాడుతూ...`` యంగ్ అండ్ టాలెంటెడ్ టీమ్ ప‌ని చేస్తోన్న ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా`` అన్నారు.
 
నిర్మాత‌లు గురురాజ్, కార్తిక్  మాట్లాడుతూ...``ఈ చిత్రాన్ని ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా తీర్చిదిద్దుతున్నాం`` అన్నారు.
 
 సంగీత ద‌ర్శ‌కుడు పిఆర్ మాట్లాడుతూ...``మ్యూజిక్ కి స్కోపున్న సినిమా ఇది. సంపూ గారితో వ‌ర్క్ చేయాల‌న్న కోరిక ఈ సినిమాతో తీరింద‌న్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుమంత్ కొత్త చిత్రం - అహం రీబూట్ ప్రారంభం