Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శంబాల లో దిష్టిబమ్మ పోస్టర్ తో ఆది సాయికుమార్ భయపెట్టిస్తాడా !

Advertiesment
Shambala poster

డీవీ

, గురువారం, 2 జనవరి 2025 (10:10 IST)
Shambala poster
ఆది సాయి కుమార్ ప్రస్తుతం శంబాల అంటూ కొత్త ప్రపంచంలోకి ఆడియెన్స్‌‌ను తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్‌ అంటూ రాబోతోన్న ఈ చిత్రానికి A (యాడ్ ఇన్ఫినిటమ్) ఫేమ్ యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌  ఆర్‌ఎఫ్‌సిలో శరవేంగా చిత్రీకరణ జరుపుకుంటోంది శంబాల.  
 
ఆది సాయి కుమార్ బర్త్ డే సందర్భంగా వదిలిన స్పెషల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఆది సాయి కుమార్ ఇంటెన్స్ లుక్, వింటేజ్ మేకోవర్ అదిరిపోయింది. ఇక న్యూ ఇయర్ స్పెషల్‌గా వదిలిన కొత్త పోస్టర్ శంబాల మీద మరింతగా ఆసక్తి పెంచేలా ఉంది. ఈ పోస్టర్‌లో చూపించిన ఆ పొలం.. ఆ దిష్టి బొమ్మ.. ఆకాశం నుంచి భూమ్మీదకు వస్తున్న అగ్ని కణం ఇలా అన్నీ కూడా కథ మీద అంచనాలు పెంచేలా ఉన్నాయి.
 
షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. అర్చన అయ్యర్ కథానాయికగా నటిస్తున్నారు. లబ్బర్ పందు ఫేమ్ స్వాసిక ఇంపార్టెంట్ కారెక్టర్‌ను పోషిస్తున్నారు. ఇంకా రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ కూడా ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీరామ్ మద్దూరి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇళయరాజా తో ఏదోజన్మలో పరిచయం.. అంటున్న కీరవాణి