Publish Date: Wed, 31 Jul 2019 (15:12 IST)
Updated Date: Wed, 31 Jul 2019 (15:14 IST)
"కిందట వారం మీ నాన్న ఫోన్ చేశాడు. అర్జెంటుగా మాట్లాడాలట" చెప్పాడు వంశీ.
"మరి ఇప్పుడా ఆ విషయం చెప్పడం?" కోపంగా అడిగింది భవాని.
"ఏం చెయ్యమంటావు? పది రోజుల కిందట పక్కింటావిడతో కబుర్లు చెప్పడానికి వెళ్ళి ఇప్పుడేగా నువ్వు వచ్చావు ..." అన్నాడు వంశీ.