Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం జ‌గ‌న్‌తో చిరు భేటీ వాయిదా, చెవిరెడ్డి పోస్టింగ్ కలకలం

Advertiesment
Chiranjeevi's meeting with CM Jagan postponed
మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా ఇటీవ‌ల రిలీజై స‌క్స‌స్‌ఫుల్‌గా ర‌న్ అవుతోన్న విష‌యం తెలిసిందే. అయితే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్ ఈ సినిమాకి ఏపీలో స్పెష‌ల్ షోస్ వేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్‌కి కృత‌జ్ఞ‌త‌లు చెప్పేందుకు చిరంజీవి, చ‌ర‌ణ్ క‌ల‌వ‌నున్నారు. ఈ రోజు జ‌గ‌న్‌తో చిరు భేటి అంటూ వార్త‌లు వ‌చ్చాయి. 
 
అయితే... ఏమైందో ఏమో కానీ వాయిదా ప‌డింది అంటూ ఈ రోజు కొత్త వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. 
అస‌లు ఎందుకు ఇలా జ‌రిగింది కార‌ణం ఏంట‌ని తెలుసుకుంటే... కొత్త విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే... సీఎం కార్యాల‌యం అస‌లు ఈ రోజు అపాయింట్మెంట్ ఇవ్వలేద‌ట‌. 
 
నిన్నచిరు పీఆర్ టీమ్‌లో ఒక‌రి అత్యుత్సాహం వ‌ల‌న అలా ప్ర‌చారం జ‌రిగింద‌ని తెలిసింది. అస‌లు నిజం ఏంటంటే... ఈ నెల 14న చిరు, చ‌ర‌ణ్ జ‌గ‌న్‌ని క‌లిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చార‌ట‌. ఇదిలావుంటే నిన్న రాత్రి చెవిరెడ్డి టీం అంటూ ఓ కామెంట్ బయటకు వచ్చింది. ఓడలు బళ్లవుతాయి... బళ్లు ఓడలు అవుతాయి అని మొదలెట్టి గతంలో జగన్ జైలులో వున్నప్పుడు చట్టం తన పని తను చేసుకుపోతుందని చెర్రీ అన్నట్లు ఆ పోస్టులో పెట్టారు.
 
పైగా అప్పుడు వైఎస్ కుటుంబం పైన అంత కసితో వున్న మెగా కుటుంబం ఇప్పుడు సీఎం జగన్‌ను కలిసేందుకు పడిగాపులు పడుతున్నదంటూ పేర్కొన్నారు. మరి ఇది నిజంగా వైసీపీ నాయకులు చేసిందా లేదంటే ఆ ఖాతాతో వేరేవాళ్లు చేసిందా తెలియాల్సి వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టిబి నియంత్రణ లక్ష్య సాధనే మనందరి ధ్యేయం: గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్