వెయిట్ లిఫ్టర్‌గా ఫోజులిచ్చిన చిన్నారి.. వీడియో వైరల్.. అచ్చం మీరాబాయిలా..? (video)

Advertiesment
Junior mirabai chanu
Junior mirabai chanu
వెయిట్ లిఫ్టర్‌గా ఫోజులిస్తున్న ఓ చిన్నారి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అచ్చం మహిళా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను లాగే అనుకరిస్తున్న ఈ వీడియోను చూసి నెటినజన్లు పడిపడి నవ్వుకుంటున్నారు. చిన్నారి వెనుక టివిలో మీరాబాయి జాను దృశ్యాలు కనిపిస్తుండగా ఆమె ఎలా చేస్తుందో సేమ్ టూ సేమ్‌గా ఈ చిన్నారి అనుకరించటం విశేషం.
 
ఈ చిన్నారి ఎవరో కాదు వెయిట్ లిఫ్టర్ సతీష్ శివలింగం కుమార్తె… భారత మహిళా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను టోక్యో ఒలంపిక్స్‌లో రజతపతకం సాధించిన నేపథ్యంలో తన కుమార్తె అమెను అనుకరిస్తున్న దృశ్యాలను సతీష్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. వీడియోలో తానో పెద్ద అరితేరిన క్రీడాకారిణాలా ఫోజులిస్తూ చిన్నారి బరువు ఎత్తటాన్ని చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
 
ప్రస్తుతం సోషల్ మీడియాలో చిన్నారి పవర్ లిఫ్టర్ వీడియో హల్ చల్ చేస్తుంది. లైకులు, కామెంట్లతో నెటిజన్లు ముంచెత్తుతున్నారు. భవిష్యత్తులో ఈ చిన్నారి మీరాబాయి చాను లా మంచి వెయిట్ లిఫ్టర్ కావాలంటూ తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 2లక్షలమందికి పైగా వీక్షించగా, 21వేలకు పైగా లైకులు వచ్చాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాన్సాస్ ట్రస్ట్ ఈవోకు హైకోర్ట్ అక్షింతలు