Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కింగ్ కోబ్రా కాటుకు గిలగిల కొట్టుకుని చనిపోయిన మృగరాజు (video)

Advertiesment
Lion and cobra

ఐవీఆర్

, శనివారం, 18 అక్టోబరు 2025 (15:45 IST)
కింగ్ కోబ్రా లేదా నల్లత్రాచు. ఇది అత్యంత భయంకరమైన సర్పము. అడవిలో అటుగా వెళ్లే సింహానికి కింగ్ కోబ్రా ఎదురైంది. సింహం వెనకడుగు వేయకుండా ఒక్క అడుగు ముందుకు వేసింది. అంతే... నల్లత్రాచు సింహం తలపైన కాటు వేసింది. దాంతో క్షణాల్లో సింహం గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు వదిలింది. సోషల్ మీడియాలో ఈ వీడియో కాస్త వైరల్ అయ్యింది.
 
కింగ్ కోబ్రా లేదా నల్లత్రాచు గురించి కొన్ని ముఖ్య విషయాలు ఒకసారి తెలుసుకుందాము. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, పొడవైన విష సర్పాలలో మొదటిదని చెప్పవచ్చు. ఇది సాధారణంగా 18.5 అడుగుల (5.7 మీటర్ల) పొడవు వరకు పెరుగుతుంది. బరువు సుమారుగా 8 కిలోల వరకు ఉంటుంది.
 
కింగ్ కోబ్రా విషం చాలా ప్రమాదకరమైనది. ఇది నాడీ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఒక కాటుతో విడుదల చేసే విషంతో ఒక పెద్ద ఆసియన్ ఏనుగును లేదా సుమారు 20 మంది మనుషులను చంపగల శక్తి దీనికి ఉంటుంది. ఇది తన శరీరంలో మూడింట ఒక వంతు వరకు భూమి నుండి పైకి లేపగలదు. శత్రువులను భయపెట్టడానికి ఇది విలక్షణమైన శబ్దాలను, కొన్నిసార్లు కుక్క అరుపును పోలిన శబ్దాన్ని కూడా చేయగలదు.
 
ఇది భారతదేశం, ఆగ్నేయాసియా, చైనాలోని కొన్ని ప్రాంతాల అడవుల్లో, దట్టమైన ఉష్ణమండల వర్షారణ్యాలు, చిత్తడి నేలల్లో ఎక్కువగా జీవిస్తుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిందీలో అనర్గళంగా మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు.. కొనియాడిన పీఎం