Publish Date: Thu, 17 Oct 2019 (12:26 IST)
Updated Date: Thu, 17 Oct 2019 (12:28 IST)
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాడు మహేష్. బయటకు రాగానే ఇంటికి వెళ్ళాడు. తల్లి, చెల్లెలితోనే ఎక్కువసేపు గడిపాడు మహేష్. అయితే తాను ఎందుకు బయటకు వచ్చింది. బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరిగింది. ఏం జరుగుతోంది. కంటెన్టెంట్లు బయటకు రావడానికి ఏదైనా కారణం ఉందా అన్న విషయాన్ని బయటపెట్టాడు మహేష్.
బిగ్ బాస్ షోలో విజయం సాధిద్దామని ప్రయత్నించాను. నా ప్రయత్నం ఫలించలేదు. 80 రోజుల పాటు ఉన్నాను. 15 మంది సభ్యులు నా పక్కన కుటుంబ సభ్యుల్లాగా మెలిగారు. ఇంట్లో వాళ్ళకు దూరమయ్యాయన్న బాధ ఒకవైపు ఉన్నా.. మరోవైపు మాత్రం కొత్త కుటుంబంలోకి చేరామన్న సంతోషం మిగిలింది.
కానీ బిగ్ బాస్ హౌస్‌లో నాగార్జున చాలా స్ట్రిక్ట్. ఆయనను చూస్తేనే నాకు భయమేస్తోంది. బయటకు వచ్చేటప్పుడు ఏం మాట్లాడుతాడేమోనని భయపడిపోయా. కానీ ఒరే నువ్వు చేసే కామెడీ నాకు బాగా నచ్చింది. ఇంటికి వెళ్ళి గుర్తుకు తెచ్చుకుని నవ్వుకుంటూ ఉంటానని నాగార్జున చెప్పారు. బిగ్ బాస్ షోను మరింత మంది ప్రేక్షకులు చూడడానికి నాగార్జునే కారణం. ఆయన పర్మాన్సెన్స్ చూడడానికి ఎక్కువమంది బిగ్ బాస్ షోకు అతుక్కుపోయారంటున్నాడు మహేష్. హౌస్ నుంచి బయటకు రావడం బాధగానే ఉన్నా.. విజయం.. అపజయం అన్నది స్పోర్టివ్‌గా తీసుకోవాలని చెబుతున్నాడు.