Publish Date: Mon, 15 Oct 2018 (11:25 IST)
Updated Date: Mon, 15 Oct 2018 (11:27 IST)
మొన్నటివరకూ కేవలం సినిమా ఇండస్ట్రీలోని కొందరిపై ఆరోపణలు చేస్తూ వస్తున్న నటి శ్రీరెడ్డి తాజాగా తన విమర్శలను రాజకీయ నాయకుడిపై చేసింది. ఆర్మూర్ నియోజకవర్గం తెరాస ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనను లైంగికంగా వేధించారంటూ తీవ్రమైన ఆరోపణలు చేయడంతో మరోసారి దుమారం రేగింది. ఈమె ఓ ప్రముఖ చానల్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.
తెలంగాణలో ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో శ్రీరెడ్డి తెరాస ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీశాయి. పైగా... ఎన్నికల్లో సరైన పార్టీకి ప్రభుత్వ పగ్గాలను అప్పగించాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఏ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడిందన్న చర్చ జరుగుతోంది. ఇకపోతే... సినీ ఇండస్ట్రీకి చెందిన బెల్లంకొండ సురేష్ పేరును కూడా ప్రస్తావించింది. మళ్లీ ఎంతమంది పేర్లను ప్రస్తావిస్తుందన్నది చర్చగా మారింది. కాగా తనవద్ద వున్న లిస్టులో చాలామంది పేర్లున్నాయనీ, అవన్నీ సమయం దొరికినపుడు బయటపెడతానంటూ వ్యాఖ్యానించింది.