Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోదుగ చెట్టును ఇంట్లో నాటవచ్చా...?

Advertiesment
Moduga Chettu
Moduga Chettu
మోదుగ చెట్టు వేసవి కాలంలో ఆకులన్నీ రాలిపోయి బోసిపోయి ఉంటుంది. కానీ చెట్టుపై ఒక్క ఆకు లేకున్నా పూలు మాత్రం విరగబూసి కనువిందు చేస్తాయి. వీటినే మోదుగ పూలు అని, అగ్ని పూలు అని పిలుస్తారు. ఈ పువ్వులు శివుడికి ఇష్టమైన పువ్వులని చెప్తారు. 
 
ముఖ్యంగా శివారాధనకు ఈ పూలనే ఉపయోగిస్తారు. వీటిలో ఔషధ గుణాలెన్నో వున్నాయి.  ఔషధాల్లో కూడా ఉపయోగిస్తారు. ఈ పూలను ఉడకబెట్టి వీటితో రంగులను కూడా తయారు చేస్తారు. ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనులు సహజసిద్ధంగా ఈ మోదుగ పూలతో తయారు చేసిన రంగులతోనే హోళి ఆడతారు. ఇవే పూలను ఆరబెట్టి పౌడర్‌గా కూడా మార్చి రంగులను తయారు చేస్తారు. ఈ మోదుగ పూలతో వాస్తు దోషాలను కూడా తొలగించుకోవచ్చు. 
 
అప్పుల ఊబిలో కూరుకుపోయి.. అనేక కష్టాలు పడుతున్నవారు.. ఆర్థికంగా పైకి రావాలి అనుకునేవారు.. ఐదు మోదుగ చెట్లను నాటితే చాలా మంచిది. ఈ చెట్లను నాటడం వల్ల సంక్షోభం నుంచి బయట పడొచ్చు. ఈ చెట్లు నాటితే కనక వర్షం కురుస్తుందని చెప్తారు. 
 
వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో కానీ ఇంటి చుట్టు పక్కల కానీ నాటకూడదు. బయట ప్రదేశాల్లో లేదంటే పొలం గట్ల మీద అయినా నాటవచ్చు. ఈ చెట్లను నాటడం వల్ల 10 రెట్లు అధికంగా పుణ్యాన్ని పొందుతాయని నమ్ముతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

14-10-2024 సోమవారం దినఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...