Publish Date: Tue, 05 Mar 2019 (11:41 IST)
Updated Date: Tue, 05 Mar 2019 (17:23 IST)
ఇంటిని నాలుగు మూలలతోనే ఎందుకు కట్టాలి.. దాని కంటే ఎక్కువగా కట్టుకుంటే.. ఏమవుతుందో తెలుసుకుందాం.. విమానం రెక్కలు టపటపమని ఆడిస్తూ అది ఆకాశంలోకి ఎగురదు. అలాంటప్పుడు దానికి అంత పొడుగు రెక్కలు వద్దు అంటే ఎలా.. శాస్త్రవేత్త నవ్వుతాడు.. మన అజ్ఞానానికి.. ఇంటి బ్యాలెన్స్ నిర్దిష్ట కొలతల విభజన గృహాన్ని ఒక సజీవ యంత్రంగా శాస్త్రం రూపొందించింది.
ప్రతి వస్తువుకు ఒక వ్యవహార యోగ్యత ఉంటుంది. కుండ ఉంది.. అది నీళ్లు నిలువ చేస్తుంది. చల్లగా ఉంచుతుంది. అది దాని యోగత్వం. దానికి నేను కింద రంధ్రం పెట్టి తయారుచేసి వాడుకుంటా అంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు. ఎవరి ఫలం వాళ్లదే కదా..
ఇల్లు కూడా అంతే.. సుదీర్ఘ భౌతిక, మానసిక ప్రయోజన వైభవరూపం శాస్త్ర గృహానిది. దీనిని ఈ నాలుగు వాక్యాలతో అందించలేం. ఆచరిస్తూ పోతే ఫలితం మీకే కదా అని పండితులు చెప్తున్నారు.