Publish Date: Wed, 19 May 2021 (14:15 IST)
Updated Date: Wed, 19 May 2021 (14:29 IST)
సాయంత్రం ఆరు దాటాక సూది, ఉప్పు, నూనె, కోడి గుడ్లు. ఇంటికి తెచ్చుకోకూడదు. అవి శని స్థానాలు. పొద్దు పోయాక పెరుగు, ఊరగాయాలు, మిరపొడి ఎవ్వరికీ ఇవ్వకండి ముఖ్యముగా శుక్రవారం, మంగళవారం ఇవ్వకండి అవి లక్ష్మీ స్థానాలు.
శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసం ఇంటికి తేకూడదు. ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రం గా ఉంచండి, పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు. వారానికి ఒక్కసారి అయినా ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేయాలి.
డబ్బు నగలు పెట్టె బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తల దువ్వడం లాంటివి చేస్తే డబ్బు అసలు నిలవదు. రాహు కాలంలో, స్నానం, భోజనం చేయాకుడదు.
ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయంలో మటుకే పెట్టాలి. వెండి వస్తువులు బహుమతులుగా ఇవ్వకూడదు. ఇంటి గుమ్మం ముందు చెప్పులు వదల కూడదు కొంచెం దూరంగా వదలాలని వాస్తు నిపుణులు చెప్తున్నారు.
సెల్వి
Publish Date: Wed, 19 May 2021 (14:15 IST)
Updated Date: Wed, 19 May 2021 (14:29 IST)