Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సేమియా ఇడ్లీ తయారీ విధానం...

Advertiesment
semiya
సేమియాతో ఉప్మాలు, పాయాసాలు వంటి వాటినే ఎక్కువగా చేస్తుంటారు. ఇంట్లోని చిన్నారులు వీటిని తినడానికి అసలు ఇష్టపడరు. అందువలన సేమియాను ఇడ్లీల్లా చేసిస్తే తప్పకుండా తింటారు. మరి సేమియాతో ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు:
సేమియా - 2 కప్పులు
ఇడ్లీ రవ్వ - పావు కప్పు
పెరుగు - 1 కప్పు
కొత్తిమీర - అరకట్ట
ఆవాలు - పావుస్పూన్
శెనగపప్పు - అరస్పూన్
మినపప్పు - అరస్పూన్
జీడిపప్పు - 10
పచ్చిమిర్చి - 3
అల్లం ముక్క - చిన్నది
కరివేపాకు - 2 రెమ్మలు 
ఉప్పు - తగినంతా
నూనె - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా బాణలిలో నూనెను పోసి వేడయ్యాక సేమియా, రవ్వను విడివిడిగా వేయించుకోవాలి. మరో బాణలిలో ఆవాలు, శెనగపప్పు, మినపప్పు వేసి వేయించి ఆ తరువాత పచ్చిమిర్చి, జీడిపప్పు, అల్లం, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఈ మిశ్రమంలో సేమియా, ఉప్పు, కొత్తిమీర, పెరుగు, కొద్దిగా నీళ్ళు పోసి కాసేపు ఉడికించుకోవాలి. సేమియా గట్టిపడిన తరువాత దానిని ఇడ్లీ పాత్రలో వేసుకుని 10 నిమిషాల పాటు ఉడికించి తీసుకుంటే వేడివేడి సేమియా ఇడ్లీ రెడీ. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ ఐదింటితో పురుషుల్లో ఆ సమస్య పరార్...