Publish Date: Wed, 28 Aug 2024 (17:47 IST)
Updated Date: Wed, 28 Aug 2024 (17:49 IST)
యాపిల్ తొక్కలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె ఉంటాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి. అందుకే యాపిల్ తొక్కను తేలికగా తీసి పారేయకూడదని అంటారు.
యాపిల్ తొక్కలోని ఫైబర్ గంటల తరబడి కడుపు నిండుగా ఉంచుతుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. దీంతో బరువు తగ్గడానికి కూడా దోహదం చేస్తుంది. యాపిల్ పీల్స్‌లో చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడే పోషకాలు ఉంటాయి.
యాపిల్ తొక్కలో క్వెరెక్టిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది ఊపిరితిత్తులను, గుండెను అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది.
యాపిల్ పీల్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. యాపిల్ పండ్లను తొక్కతో తింటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.
సెల్వి
Publish Date: Wed, 28 Aug 2024 (17:47 IST)
Updated Date: Wed, 28 Aug 2024 (17:49 IST)