Astrology Monthly Horoscope Details

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

మేషం
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ వేసుకుంటారు. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. స్నేహసంబంధాలు, వ్యాపకాలు అధికమవుతాయి. తరచు ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కొత్తయత్నాలకు సన్నాహాలు సాగిస్తారు. నోటీసులు అందుతాయి. నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. ఏ విషయంలోను ఒంటెద్దు పోకడ తగదు. సన్నిహితుల సలహా పాటించండి. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. వస్త్ర, వెండి బంగారు వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు బదిలీతో కూడిన పదోన్నతి. ఆరోగ్యం బాగుంటుంది. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివెళ్లకండి.