Astrology Monthly Horoscope Details

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

మకరం
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు మీ ఓర్పు, నేర్పులకు పరీక్షా సమయం. ఆచితూచి అడుగు ముందుకు వేయండి. తొందరపాటు చర్యలు తగవు. అందరితోనూ మితంగా సంభాషించండి. ఎవరినీ తక్కువ అంచనా వేయవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. పొదుపునకు అవకాశం లేదు. దూరపు బంధువులను కలుసుకుంటారు. భార్యాభర్తల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. హామీలు, మధ్యవర్తిత్వాలు తగవు. సంతోషం, ఉత్సాహాన్ని అదుపు చేయండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. పనులు ముగింపు దశలో హడావుడిగా ఉంటాయి. మీపై ఇతరుల ప్రభావం అధికం. ఉపాధ్యాయులు పురస్కారం అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడి కంటే సొంత వ్యాపారాలే కలిసి వస్తాయి.