Astrology Monthly Horoscope Details

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

కర్కాటకం
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. యత్నాలను సన్నిహితులు ప్రోత్సహిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ చేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పనులు చురుకుగా సాగుతాయి. అందరితోనూ మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన వద్దు. భార్యాభర్తల మధ్య అవగాహన నెలకొంటుంది. బంధువుల రాకపోకలు ప్రారంభమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త. క్రమం తప్పకుండా ఔషధ సేవనం పాటించండి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ప్రైవేటు ఉద్యోగులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాల్లో నష్టాలను సమీక్షించుకుంటారు. చిన్న వ్యాపారాలు ఊపందుకుంటాయి. దైవదర్శనాలు ఉల్లాసం కలిగిస్తాయి. ప్రయాణం సజావుగా సాగుతుంది.