Astrology Monthly Horoscope Details

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

సింహం
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం అన్ని రంగాల వారికి బాగుంటుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఉభయులకూ మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. స్థిరాస్తి ధనం అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. వివాహయత్నం ఫలిస్తుంది. కల్యాణ వేదికలు అన్వేషిస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు, ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. వృత్తి ఉపాధి పథకాలు పురోగతిన సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధ్యాయులకు స్థానచలనం తప్పనిసరి. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.