మేషం
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
వ్యవహారజయం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు వేగవంతమవుతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు విపరీతం. ఆత్మీయులను వేడుకలు, విందుకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. పరిచయాలు బలపడతాయి. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. సోమవారం నాడు ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. సన్నిహితుల సలహా పాటించండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆందోళన తగ్గి స్థిమితపడతారు. సంతానం దూకుడు అదుపుచేయండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిన్నవ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.