మిథునం
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. మీ నిర్ణయం అందరికీ శిరోధార్యమవుతుంది. వ్యూహాత్మకంగా అడుగు ముందుకేస్తారు. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆసక్తికరమైన విషయం తెలుసుకుంటారు. ఆదివారం నాడు ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు. ధైర్యంగా ముందుకు సాగుతారు. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. చెప్పుడు మాటలకు ప్రాధాన్యమివ్వవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోండి. అవివాహితులు శుభవార్త వింటారు. ఉపాధి పథకాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. చిరు వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.