తుల
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
పరిస్థితులు కొంత వరకు అనుకూలంగా ఉన్నాయి. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఎవరిపైనా భారం వేయొద్దు. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సన్నిహితులను విందుకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. నగదు కీలక పత్రాలు జాగ్రత్త. సంతానం దుడుకుతనం ఇబ్బంది కలిగిస్తుంది. విజ్ఞతతో సమస్య పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగ ఉపాధ్యాయుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి.