Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెలుపు తథ్యం... 110 నుంచి 140 సీట్లు మావే... : చంద్రబాబు

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (14:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తంచేశారు. ఆయన సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో గెలుపు ద్వారా టీడీపీ చరిత్ర సృష్టించబోతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 110 నుంచి 140 సీట్ల వరకూ టీడీపీ దక్కించుకుంటుందన్న అభిప్రాయం సర్వత్రా ఉందన్నారు. రాష్ట్రంలో టీడీపీ గెలుపు వెయ్యి శాతం విజయం తథ్యమన్నారు. 
 
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పార్టీ పోరాటం చేస్తోందన్నారు. వైసీపీ అరాచకాలను, బీజేపీ తప్పుడు పనులను ప్రజల్లో ఎండగట్టామని వ్యాఖ్యానించారు. ఎన్నికల వేళ టీడీపీపై ప్రతీరోజూ దాడులు జరిగాయనీ, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. ఏపీలో దాదాపు 8 లక్షల ఓట్లను తొలగించేందుకు కుట్రలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఢిల్లీలో 30 లక్షల ఓట్లను తొలగించారన్నారు. ఫామ్ 7తో  ఏపీలోనూ భారీ సంఖ్యలో ఓట్లను తొలగించాలని కుట్ర పన్నారనీ కానీ తాము ఆరంభంలోనే మేల్కొనడంతో ఏం చేయలేక పోయారన్నారు. 
 
ఇకపోతే, తొలి దశ పోలింగ్ రోజున రాష్ట్రంలో ఏర్పాటు చేసిన అనేక పోలింగ్ కేంద్రాల్లో అమర్చిన ఈవీఎంలు మొరాయించాయనీ ఈ కారణంగా చాలా మంది ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారన్నారు. ఇలాంటివారిలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ కూడా ఉన్నారన్నారు.  ఆ తర్వాత తన పిలుపుతో మళ్లీ వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. అసలు 50 శాతం వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను లెక్కించడానికి ఈసీకి ఉన్న అభ్యంతరం ఏంటని టీడీపీ అధినేత చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments