Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూతలపట్టు వైకాపా అసెంబ్లీ అభ్యర్థిని చితకబాదిన గ్రామస్థులు

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (16:02 IST)
చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంఎస్ బాబును ఓటర్లు చితకబాదారు. ఈ సెగ్మెంట్‌లో అధికార టీడీపీకి బలమైన పట్టుంది. అయితే ఈ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థిగా ఎంఎస్ బాబు పోటీ చేస్తున్నారు. ఈయన గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన తర్వాత పోలింగ్ సరళిని తనిఖీ చేసేందుకు తన అనుచరులతో కలిసి ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. 
 
ఈ క్రమంలో ఐరాల మండలంలోని కట్టకిందపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. ఆ పోలింగ్ కేంద్రంలో ఓట్లన్నీ సైకిల్ గుర్తుకు పడుతున్నాయని గ్రహించిన ఆయన ఆగ్రహంతో రగిలిపోయి... ఈవీఎంలతో పాటు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో తిరగబడిన గ్రామస్థలు.. ఎమ్మెల్యే అభ్యర్థి బాబును పట్టుకుని చితకబాదారు. అంతేకాకుండా, ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాబును ఐరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తొలుత తరలించి, అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే, ఇదే మండలంలోని రెడ్డివారిపల్లిలో కూడా టీడీపీ - వైకాపా కార్యకర్తలు, ఏజెంట్ల మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశారు. చిత్తూరు జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం ఒక్క పూతలపట్టు సెగ్మెంట్‌లోనే ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రిటీష్ కాలం నాటి కథతో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్నచిత్రం

కమల్ హాసన్ థగ్ లైఫ్ వేడుకకు సమయంకాదని వాయిదా

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments